Sai Pallavi: సాయి పల్లవి లైఫ్ నే మార్చేసిన చిరంజీవి.. ఏం జరిగిందంటే?

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి దిగ్గజ హీరోల లిస్ట్ లో ఎప్పటికీ నిలిచిపోయి ఉండే పేర్లలో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఒకటి. స్వయంకృషితో మొదలైన తన ప్రయాణం ఇపుడు ఎక్కడ వరకు వచ్చిందో తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రెజెంట్ ఉన్న జెనరేషన్ తనపై పలు ట్రోల్స్ లాంటివి చేస్తుంటారు కానీ తానేంటో తన రేంజ్ ఏంటో ఇపుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న దర్శకులని అడిగితే చెప్తారు మెగాస్టార్ అంటే ఏంటో.

కానీ ఇవన్నీ ఈ నెటిజన్స్ పట్టించుకోరు కానీ ఎంతోమందికి మెగాస్టార్ ఒక ప్రేరణగా నిలిచారు. కాగా తనని చూసి దర్శకులు అయ్యినవారు ఉన్నారు అలాగే ఇండస్ట్రీలోకి హీరోలుగా వచ్చినవారు డాన్స్ మాస్టర్స్ అయ్యినవారు ఇలా చాలా మందే మెగాస్టార్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చినవారు అనేకమంది. అయితే ఇపుడు ఈ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా చేరడం గమనార్హం.

chiranjeevi movie changed sai pallavi whole life

సౌత్ లో సాయి పల్లవి హవా ఇపుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మెయిన్ గా సాయి పల్లవి అంటే డాన్స్, డాన్స్ అంటే సాయి పల్లవి అని అందరికీ తెలుసు. అలా ఓ డాన్స్ షో తోనే వచ్చిన ఈ యంగ్ నటి ఇపుడు చేసిన పలు చిత్రాల్లో డాన్స్ కోసం హిట్ అయ్యినవి చాలా ఉన్నాయి.

అంతే కాకుండా తన డాన్స్ నంబర్స్ కి వందల మిలియన్స్ కొద్దీ వ్యూస్ కూడా ఉన్నాయి. ఇంతేనా పలు చిత్రాల్లో కావాలని సాయి పల్లవి డాన్స్ లని ఇరికిస్తున్నారా అనే రేంజ్ లో తనపై కామెంట్స్ కూడా వచ్చాయి. కాగా అసలు ఈ అంతటికీ మూల కారణం మెగాస్టార్ చిరంజీవే అని సాయి పల్లవి ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

chiranjeevi movie changed sai pallavi whole life

ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తాను డాన్సర్ అవ్వాలి అనికున్నది చిరంజీవిని చూసే అని రివీల్ చేసింది. మెగాస్టార్ మాస్ హిట్ చిత్రం "ముఠా మేస్త్రి" సినిమా ఎన్నో సార్లు చూశానని అందులో చిరంజీవి గారి డాన్స్ లు చూసి నేను కూడా డాన్స్ లు చేసానని అక్కడే తాను డాన్సర్ కావాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టుగా తెలిపింది.

ఇక ఆ మధ్య మెగాస్టార్ తో ఓ ఈవెంట్ లో డాన్స్ చేయడం అనేది తన జీవితంలోనే మర్చిపోని మెమొరీ అని చెప్పుకొచ్చింది. దీనితో సాయి పల్లవి లైఫ్ ని మెగాస్టార్ ఇలా మార్చారని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గానే సాయి పల్లవి తండేల్ అనే సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో కూడా సాయి పల్లవిపై అదిరే డాన్స్ నంబర్స్ ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య హీరోగా నటించగా ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది.

More from Filmibeat

Read more about: sai pallavi chiranjeevi thandel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X