ఆఫర్లు లేక చితికిపోయిన చిరంజీవి హీరోయిన్ .. ఇండస్ట్రీ వదిలేసి దుబాయ్‌లో దారుణంగా!
సినిమా పరిశ్రమలో తారల జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. ఓ రోజు స్టార్‌గా పేరు సంపాదించుకొన్న యాక్టర్లు.. కట్ చేస్తే.. అవకాశాలు ముఖం చాటేసి.. ఆర్థికంగా చితికిపోయి.. కనిపించిన దాఖలాలు చాలానే ఉంటాయి. అనిశ్చితి ఎక్కువగా కనిపించే ఇండస్ట్రీలో చాలా మంది తారలు తమ ఆర్థిక భద్రతపై ప్రధానంగా దృష్టి పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం స్టార్ రాణించినప్పటికీ.. ఉన్నపళంగా కిందపడిపోతుంటారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా బతుకుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం సినిమా రంగాన్ని వదలేసి సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నది. ఓ హీరోయిన్ ప్రస్తుతం సినిమా ప్రపంచానికి దూరమై.. ఉద్యోగం చేసుకొంటూ జీవిస్తున్నారు. ఆ తార ఎవరు? ప్రస్తుతం ఏం ఉద్యోగం చేస్తున్నదనే వివరాల్లోకి వెళితే..
బెంగాల్‌కు చెందిన రిమీ సేన్ సినిమా రంగంపై మోజుతో ముంబై చేరుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకొనే పనిలో పడింది. అయితే ఆరంభంలో తన లక్ వర్కవుట్ అయి వెంట వెంటనే హిందీ, తెలుగు, బెంగాళీ భాషల్లో అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. బెంగాళీ చిత్రం పరోమితార్ ఏక్ దిన్ చిత్రం ద్వారా 2000 సంవత్సరంలో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2001 సంవత్సరంలో తెలుగులో ఇదే నా మొదటి ప్రేమ లేఖ, 2002 ఏడాదిలో నీ తోడు కావాలి సినిమాల్లో నటించింది.

తెలుగు నటిస్తుండగానే బాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. అక్షయ్ ఖన్నా, అఫ్తాబ్ నటించిన హంగామా చిత్రంలో నటించి మెప్పించింది. ఆ సినిమా భారీ హిట్ కావడంతో అమితాబ్‌తో భాగ్‌బన్ మూవీలో నటించింది. ఆ తర్వాత భారీ చిత్రం ధూమ్‌లో అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. అలా పలు భాషల్లో ఆమె బిజీగా కెరీర్‌ను కొనసాగించింది.
అయితే 2004 సంవత్సరంలో చిరంజీవితో అందరివాడులో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత గరమ్ మసాల, ఫిర్ హేరాఫెరీ, గోల్‌మాల్ అన్ లిమిటెడ్, ధూమ్ 2 చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ జాబితాలో చేరేందుకు ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అవకాశాలు సన్నగిల్లాయి. 2011 తర్వాత దాదాపు 2016 వరకు సినిమాలు లేకపోవడంతో ఆమె కెరీర్‌కు బ్రేక్ పడింది. 2016 వచ్చిన బదియా సింగ్ సినిమా కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయింది.
సినిమా రంగంలో అవకాశాలు లేకపోవడంతో బిగ్‌బాస్ 9 లో నటించింది. ఆ తర్వాత ఝలక్ దిక్లా జా 9 లో పాల్గొన్నది. అయినా పరిస్థితిలో మార్పు లేకపోయింది. తన మకాంను దుబాయ్‌కి మార్చింది. ఆమె దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ మీడియాకు చిక్కింది. ఆమెకు సంబంధించిన లేటేస్ట్ వీడియోను చూసిన వారందరూ షాక్ గురయ్యారు. ఆమె కనీసం గుర్తుపట్టని విధంగా మారిపోయింది. తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నారేమో అనేంతగా రూమర్లు మీడియాలో వచ్చాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో దుబాయ్‌లోని బిల్డ్‌కాప్స్ రియల్ ఎస్టేట్ ఎల్ఎల్‌సీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వర్క్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

అయితే తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నారనే రూమర్లను రిమీ సేన్ కొట్టిపడేసింది. తన ముఖం రంగు కొంత మారి ఉంటుంది. అందువల్లనే తేడా కనిపిచింది. తన ముఖ రూపాన్ని మార్చుకోవడానికి తానేమీ నేరాలు, ఘోరాలు చేయలేదు కదా అంటూ అంది. అయితే కొంత మేరకు తాను కేర్ తీసుకోకపోవడంతో అలా రంగు మారి ఉంటుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా దుబాయ్‌లో జీవితం సాఫీగా సాగుతుంది అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











