ఆ స్టార్ హీరోకి యాక్టింగ్ అస్సలు రాదు.. చిరంజీవి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ రిమీ సేన్ (Rimi Sen).తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో వరుస సినిమాలతో బిజీగా కనిపించిన రిమీ సేన్, ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడినట్లు సమాచారం. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరో పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్‌ కారణంగా మళ్లీ సినీ వర్గాల్లో ఆమె పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

రిమీ సేన్ అసలు పేరు సుభమిత్ర సేన్‌. బెంగాలీ చిత్రం పరోమితర్ ఏక్ దిన్తో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆమె, తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత నీ తోడు కావాలి (2002), అందరివాడు (2005) వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. టాలీవుడ్‌లో ఆమె కెరీర్ చిన్నదే అయినా, గ్లామర్‌తో పాటు నటన పరంగా ప్రత్యేక గుర్తింపు దక్కింది. బాలీవుడ్‌లో అయితే రిమీ సేన్ కెరీర్ మరింత వెలుగొందింది. ధూమ్, క్యోన్ కి, గరం మసాలా, గోల్‌మాల్, ఫిర్ హేరా ఫేరీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో 2000వ దశకంలో యువత మనసు గెలుచుకున్నారు. ఆ సమయంలో వరుస హిట్ సినిమాలతో టాప్ హీరోల సరసన నటిస్తూ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా కొనసాగారు.

Chiranjeevi s Heroine Rimi Sen Makes Shocking Remarks on John Abraham s Acting Skills

ఇదిలా ఉండగా, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రిమీ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'జాన్ అబ్రహం నాకు వ్యక్తిగతంగా తెలుసు. కెరీర్ ప్రారంభంలో అతను మోడల్ మాత్రమే. అతనికి నటన అస్సలు రాదు. అయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా చాలా తెలివిగా తన బాడీ, లుక్స్ హైలైట్ అయ్యే పాత్రలనే ఎంచుకున్నాడు' అని రిమీ సేన్ తెలిపారు. తన నటనపై విమర్శలు వచ్చినా వాటికి స్పందించకుండా, స్టైలిష్‌గా కనిపించే యాక్షన్ పాత్రలపైనే ఫోకస్ పెట్టాడని ఆమె చెప్పారు.

'యాక్షన్ సినిమాలు చేయడం ద్వారా ప్రేక్షకులు వేలెత్తి చూపే అవకాశమే ఇవ్వలేదు. రెగ్యులర్‌గా కెమెరా ముందు ఉండడంతో మెల్లమెల్లగా నటన కూడా నేర్చుకున్నాడు. ఇది అతని స్ట్రాటజీ' అని రిమీ సేన్ విశ్లేషించారు. 2004లో సంజయ్ గాధ్వి దర్శకత్వంలో తెరకెక్కిన ధూమ్ సినిమా గురించి కూడా రిమీ సేన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సినిమాలో ఆమె అభిషేక్ బచ్చన్ భార్య పాత్రలో నటించగా, జాన్ అబ్రహం నెగెటివ్ రోల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమా బాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీలకు బీజం వేసిందని ఆమె గుర్తు చేశారు.

ప్రస్తుతం జాన్ అబ్రహం నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా, బిజినెస్‌మ్యాన్‌గా కూడా రాణిస్తున్నారని రిమీ సేన్ పేర్కొన్నారు. ఇటీవల టెహ్రాన్ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించిన జాన్, ప్రస్తుతం తారిఖ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక రిమీ సేన్ విషయానికి వస్తే, ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డారు. ఒక స్టార్ హీరో కెరీర్‌ను వెనక్కి తిరిగి విశ్లేషిస్తూ రిమీ సేన్ చేసిన ఈ వ్యాఖ్యలు, "నటన రాకపోయినా సరైన వ్యూహంతో స్టార్‌గా ఎదగవచ్చు" అనే చర్చకు తెరతీశాయి.

More from Filmibeat

Read more about: john abraham rimi sen chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X