తండ్రి కోసం తమన్నాను సిద్ధం చేసిన చిరంజీవి డాటర్
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత మంచి కాస్ట్యూమ్ డిజైనర్ అనే విషయం తెలిసిందే. అయితే ఆమె తన తండ్రి సినిమా కోసం బాగా శ్రమిస్తోందట. హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా మెలకువగా ఆలోచించి విభిన్న రీతిలో అట్రాక్ట్ చేసేలా అడుగులు వేస్తోందట. మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డిలో తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా 'సైరా' సినిమా విశేషాలని తెలిపింది.
ఈ చిత్రం కోసం తాను అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరించినట్లు తమన్నా పేర్కొంది.
''చారిత్రాక నేపథ్యంలో తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నేను యువరాణిగా నటిస్తున్నాను. ఈ మేరకు చిత్రంలో కాస్ట్లీ లెహెంగా ధరించాను. ఇప్పటివరకు నేను ధరించిన ఖరీదైన దుస్తులు ఇవే. చిరంజీవి కుమార్తె సుస్మిత, ప్రముఖ డిజైనర్ అంజు మోడీ కలసి వీటిని డిజైన్ చేశారు'' అని తమన్నా తెలిపింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 2 వ తేదీన విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

మెగాస్టార్ కెరీర్ లోనే ప్రెస్టీజియస్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మెగాస్టార్ 151 వ సినిమాగా వస్తున్న సైరా పై మెగా అభిమానులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. కాగా వారి అంచనాలను మించి ఈ చిత్రంలోని సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అంటోంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











