40 ఏళ్ల వయసులోనే త్రిష హాట్..అప్పటికంటే ఎప్పుడే ఘాటుగా..మోజు పడ్డ సినీ ప్రముఖుడు
తెలుగు సినిమా సహా సౌత్ ఇండియా సినిమా దగ్గర కొన్నేళ్లు అలా వెనక్కి వెళితే ఇప్పుడు స్టార్స్ హీరోయిన్స్ కి ముందు ఇప్పటికీ స్టార్ హీరోయిన్స్ గా మంచి డిమాండ్ లో కొనసాగుతున్న హీరోయిన్స్ మాత్రం కొందరే కనిపిస్తారు. అలా అప్పుడు ఇప్పుడూ అలరిస్తున్న సౌత్ స్టార్ హీరోయిన్స్ లో కోలీవుడ్ నటి త్రిష కృష్ణన్ కూడా ఒకరు. మరి త్రిష హీరోయిన్ గా తమిళ్ సహా తెలుగులో ఎన్నో సినిమాలు చేసి సౌత్ మార్కెట్ లో తనకంటూ మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది.
కాగా సినిమాల్లో అలా చాలా ఏళ్ళు గడిచేసరికి ఒక టైం లో ఫేడ్ అవుట్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది త్రిష. అయితే ఇటీవల కొన్నేల్ల నుంచి త్రిష భారీ సినిమాల ఆఫర్లు అందుకొని సౌత్ లో బిజీగా మారిపోయింది. కాగా దక్షిణాదిన విజయ్, మెగాస్టార్ చిరంజీవి ఇలా బిగ్స్ స్టార్స్ సినిమాలో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న త్రిష పై ఆమెతో వర్క్ చేసిన ప్రముఖ టెక్నీషియన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

కాగా త్రిష చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తెలుగులో భారీ చిత్రం విశ్వంభర కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సినిమాలో మళ్ళీ త్రిష ఎన్నో ఏళ్ళు తర్వాత హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో స్టాలిన్ సినిమాకి వర్క్ చేసిన ఈ ఇద్దరు మళ్ళీ ఇప్పుడు కలిసి వర్క్ చేస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకి వర్క్ చేస్తున్న ప్రముఖ కాంట్రవర్సియల్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.
త్రిష తో నేను అప్పుడూ వర్క్ చేశాను ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నాను ఇప్పుడే త్రిష అందంగా ఉంది అంటూ షూటింగ్ కామెంట్స్ చేశారు. దీనితో అంటే అప్పుడు వర్క్ చేసినపుడు ఆమె అందంగా అనిపించలేదా అనే ప్రశ్న లేవనెత్తుతుంది. ఏది ఏమైనప్పటికీ త్రిష విషయంలో మాత్రం చోటా చేసిన ఈ సూటి కామెంట్స్ మాత్రం ఫ్యాన్స్ కొంచెం కరుకుగానే అనిపించేలా ఉన్నాయి.

త్రిష అప్పుడు అందంగానే ఇప్పుడూ అదే గ్లామర్ ని 40స్ లో కూడా మెయింటన్ చేస్తుంది అని టాక్ ఉంది. మరి ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ అనేది కొంచెం ఆలోచించాలి. మరి దీనిపై త్రిష సైడ్ నుంచి ఏమన్నా రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.
ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్నా ఫాంటసి చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కి వస్తుండగా రీసెంట్ గానే జనవరి రేస్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించబడింది. దీనితో కొత్త సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ సినిమా కాకుండా రీసెంట్ గా కోలీవుడ్ చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం లో త్రిష ఒక స్పెషల్ ఐటెం సాంగ్ విజయ్ దళపతి సరసనచేసి అదరగొట్టింది. దీనితో మరోసారి త్రిష వార్తల్లోకి ఎక్కింది.


Click it and Unblock the Notifications











