నాగచైతన్యకు శాశ్వతంగా గుడ్ బై.. ఆ జ్ఞాపకాన్ని చేరిపేసిన సమంత.. నెటిజన్ల ట్రోలింగ్!

అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం చేసుకుని ప్రస్తుతం హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్, పెళ్లి సమయంలో సమంత పేరు వార్తల్లో తెగ వినిపించింది. నేటికీ కూడా సమంత ప్రస్తావన కనిపిస్తూనే ఉంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు సామ్. అయితే ఆమె చేసే పోస్టులు, రాతలు అప్పుడప్పుడు కలకలం రేపుతున్నాయి. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏమాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన సమంత - నాగచైతన్యల జోడీ కొన్నాళ్లు డేటింగ్ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కింది. గోవాలో జరిగిన కార్యక్రమంలో హిందూ, క్రిస్టియన్ ఆచారాల ప్రకారం ఈ జంట పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోయి అభిమానులకు, సినీరంగానికి షాకిచ్చింది. నాటి నుంచి నాగచైతన్య - సమంతల దారులు వేరయ్యాయి.

citadel Actress Samantha Ruth Prabhu Got Rid Of Her Matching Tattoo With Ex-Husband Naga Chaitanya

విడాకుల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నాగచైతన్య .. ఒంటరిగా జీవితాన్ని లీడ్ చేయలేమని తొందరగానే గ్రహించి శోభితను తన జీవితంలోకి ఆహ్వానించారు. చైతన్యతో డివోర్స్ తర్వాత సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిందని ఫిలింనగర్ టాక్. మధ్యలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డ ఆమె దీనికి చికిత్స తీసుకుంటూనే , సినిమాలను కూడా ఫినిష్ చేశారు. మానసికంగా ధృఢంగా ఉండటానికి కోయంబత్తూరులోని సద్గురు జగ్గీవాసుదేవ్ ఆశ్రమంలో ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయారు సామ్. తన వయసు, స్టార్‌డమ్‌కు తగ్గట్లుగా కథాబలం ఉన్న సినిమాలకి ఓకే చెబుతూ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు.

సినిమాలు కాకుండా వెబ్ సిరీస్‌లలో నటిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదిస్తున్నారు. అయితే విడాకుల తర్వాత ఏనాడూ నాగచైతన్యను పల్లెత్తు మాట కూడా అనని సమంత.. ఇటీవల పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను, చైతన్య కనుక ఒకే గదిలో ఉండి అక్కడ కత్తులు కనుక ఉంటే వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుందన్నారు. అలాగే తాను సంపాదించిన డబ్బులో అత్యధిక మొత్తం తన మాజీకి గిఫ్ట్‌లు ఇవ్వడం కోసమే ఖర్చు చేశానని సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైవాహిక బంధం నుంచి బయటికి రావడానికి చాలా శ్రమించానని ఓ సందర్భంలో అన్నారు.

నాగచైతన్య జ్ఞాపకాలు తన వద్ద ఏవీ ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా సమంత వ్యవహరిస్తున్నారు. అన్నింటిని వదిలించుకున్న ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో నాగచైతన్యతో రిలేషన్ సమయంలో వేయించుకున్న టాటూ సరిగా కనిపించకపోవడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది కనిపించి కనిపించకుండా మసక మసకగా ఉంది. దీంతో ఈ టాటూని తొలగించడానికి సమంత ప్రయత్నిస్తున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదే రకమైన టాటూ నాగచైతన్య చేతిపైనా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ గుర్తును చెరిపివేయాలని సమంత ప్రయత్నించడంపై అక్కినేని అభిమానులు, నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత తెలుగులో చాలా రోజుల తర్వాత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి స్వయంగా సామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నిర్మిస్తోన్న రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్‌డమ్ అనే వెబ్‌సిరీస్‌లోనూ సమంత నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X