వైరల్ అయిన అనుష్క ఫోటో.. అసలు విషయం ఇదేనా!
భాగమతి తరువాత అనుష్క నుంచి మరో చిత్రం రాలేదు. అనుష్క తన పాదానికి మెట్టెల్లాంటి ఆకులతో ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోతో అనుష్క పెళ్లి గురించి మరో మారు అభిమానుల మధ్య చర్చ జరిగింది. త్వరలో పెళ్లి కాబోతోందంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
తాజాగా ఆ ఫోటో గురించి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క బరువు తగ్గేందుకు నార్వేలో సహజసిద్ధమైన చికిత్స చేయించుకుంటోంది. అనుష్క ఉంటున్న వైద్యశాల చుట్టూ అందమైన ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అనుష్క ఈ ఫోటో పోస్ట్ చేసిందని అంటున్నారు. అంతేకాని ఈ ఫొటోకు, అనుష్క పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదట.

బాహుబలి తరువాత కాస్త బరువు పెరిగిన అనుష్క భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది. మరో చిత్రానికి సైన్ చేయలేదు. నార్వేలో చికిత్స పూర్తయిన అనంతరం అనుష్క తిరిగి ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











