Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సమంత విషయంలో వస్తున్న ఆ వార్తలు నిజమే.. కానీ అందరూ అనుకున్నట్లు కాదట.!
అక్కినేని నాగ చైతన్య నటించిన 'ఏ మాయ చేశావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సమంత. ఈ సినిమాలో అత్యుత్తమ నటనను కనబరిచి ఎంతో పేరు సంపాదించుకుంది. దీని తర్వాత ఆమె మంచి మంచి అవకాశాలను దక్కించుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మార్కెట్‌ను సైతం పెంచుకుంది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈమె సూపర్ ఫామ్‌లో ఉంది. కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సామ్.. ఈ మధ్య కొంచెం నెమ్మదించింది. తాజాగా ఆమె గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త.? పూర్తి వివరాల్లోకి వెళితే...
ఇక్కడా.. అక్కడ సూపర్ సక్సెస్
త్రివక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ' నుంచి సమంత కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. దీని తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇందులో ఆమెలోని అత్యుత్తమ నటనను రాబట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాదు.. తమిళంలోనూ సమంత వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
కేవలం ఒక్కటి మాత్రమే ఉంది
‘ఓ బేబీ' తర్వాత అక్కినేని వారి కోడలు నటించిన చిత్రాలు ఏమీ విడుదల కాలేదు. అయితే, తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96' తెలుగు రీమేక్‌లో శర్వానంద్ సరసన నటించిన సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసింది. అలాగే, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలోకి అడుగు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ.
సమంత విషయంలో ఎన్నో రూమర్లు
అక్కినేని సమంత ఈ మధ్య మరే ప్రాజెక్టునూ ఫైనలైజ్ చేయలేదు. కానీ, ఆమె తదుపరి చిత్రాల విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. సామ్.. నాగ చైతన్యతో కలిసి నటించబోతుందని ఈ మధ్య ఓ వార్త వైరల్ అయింది. అలాగే, ఆమె స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పేసిందని అన్నారు. అంతేకాదు, తమిళ సినిమాలకూ పచ్చజెండా ఊపినట్లు వార్తలు వచ్చాయి.
అక్కినేని వారి కోడలు తల్లి కాబోతుంది
కొన్నేళ్ల క్రితం సమంత.. అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, సామ్ మాత్రం సినిమాలు చేస్తూనే ఉంది. అయితే, ఇటీవల సినిమాలు తగ్గించడంతో సమంత తల్లి కాబోతుందన్న వార్తలు స్పీడందుకున్నాయి.
సమంత విషయంలో వస్తున్న వార్తలు నిజమే
ఇటీవల సమంత మరో సినిమాను ఓకే చేసేసిందన్న వార్త హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. నయనతారతో ‘మాయ', తాప్సీతో ‘గేమ్ ఓవర్' వంటి హర్రర్ చిత్రాలను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సామ్ సినిమా చేయబోతుందన్న వార్తలు నిజమేనని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని టాక్.
అందరూ అనుకున్నట్లు కాదట.!
ఈ సినిమా గురించి ప్రచారం మొదలైనప్పుడే మరో హాట్ టాపిక్ కూడా వైరల్ అయింది. సమంత చేయబోయే సినిమా ఇటీవల హత్యాచారానికి గురైన ‘దిశ' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుందని అన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అలా ఉండదట. హర్రర్ జోనర్‌లోనే ఉండే ఈ మూవీ కొంచెం కొత్తగా తీయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.