కరోనా బారిన పడ్డ సీఎంపై నగ్మా సెటైర్లు.. ఇప్పుడైనా వదిన చేసిన పాపడ్లు తిను.. .

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయంపై సినీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆగస్టు 24వ తేదీన సీఎం ఖట్టార్ కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే హర్యానా సీఎంను ఉద్దేశించి నగ్మా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఆగస్టు 24వ తేదీన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ట్వీట్ చేస్తూ.. నాకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. రిపోర్టులు కూడా అదే విషయాన్ని ధృవీకరించాయి. నాకు దగ్గరగా పనిచేసే సిబ్బందికి నా మనవి ఏమిటంటే.. గత వారం నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులందూ వెంటనే టెస్టులు చేసుకొండి.. వెంటనే తప్పనిసరిగా క్వారంటైన్‌కు వెళ్లండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

CM Manohar Lal Khattar tested corona Positive, Nagma Satires misfired

సీఎం ఖట్టార్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తూ.. ఇప్పుడు ఈయనకు కూడా కరోనానా? హే రామ్.. కోవిడ్ 19. ఇప్పుడైన వదిన చేసిన పాపడ్ తప్పకుండా తినండి. హర్యానా సీఎం గారు.. కశ్మీరీ కూతుళ్ల గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడైనా సరిదిద్దుకొండి అంటూ ఆమె ట్వీట్ చేశారు.

అయితే సీఎం, వయసులో పెద్దవారనే విషయాన్ని పట్టించుకోకుండా నగ్మా రాజకీయాలు చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు అంటూ కొందరు ట్వీట్లు చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X