For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ టేప్ బాధించింది, హీరో నిఖిల్ అలాంటోడు కాదు: కలర్స్ స్వాతి

|

కలర్స్ కార్యక్రమం ద్వారా యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన స్వాతి తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేసి హీరోయిన్‌గా ఎదిగి సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ రేంజి కాకపోయినా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కలర్స్ స్వాతి ఇటీవలే ఇంటర్నేషనల్ పైలట్ వికాస్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిది లవ్ అండ్ ఆరెంజ్డ్ మ్యారేజ్. వికాస్ ఇండోనేషియాలోని జకార్తాలో ఉంటున్నాడు. పెళ్లి తర్వాత స్వాతి కూడా అక్కడికి మకాం మార్చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్వాతి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నీ బొందరరేయ్..

నీ బొందరరేయ్..

‘నీ బొందరరేయ్'... ఏంటి అనుకుంటున్నారా? ఇది స్వాతి ఫేవరెట్ పంచ్ లైన్. ఈ మాటను ఆమె తరచూ వాడుతుంటారట. ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో కూడా అప్పుడప్పుడు ఈ పంచ్ కనిపిస్తూ ఉంటుంది.

పెద్ద డైరెక్టర్లు కూడా చెత్త సినిమాలు

పెద్ద డైరెక్టర్లు కూడా చెత్త సినిమాలు

మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నకు స్వాతి స్పందిస్తూ... అసలు నేను సినిమాలు చేస్తాననే డ్రీమ్ చేయలేదు. అలాంటిది డ్రీమ్ డైరెక్టర్ ఎవరుంటారు?... ఈ మధ్య పెద్ద డైరెక్టర్లు కూడా చెత్త సినిమాలు తీస్తున్నారు. తెలియని వాళ్లు, కొత్త వాళ్లు వచ్చి అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. అందరితో పని చేయాలనుకుంటాను... అని స్వాతి తెలిపారు.

మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

మా ఆయనకు మాత్రమే కనిపించే ప్లేసులో టాటూ

మా ఆయనకు మాత్రమే కనిపించే ప్లేసులో టాటూ

స్వాతి ఫింగర్ మీద టాటూ ఉంది. అక్కడ ఎందుకు వేయించుకున్నారు? అంటే... ఎవరైనా నన్ను సిల్లీ క్వశ్చన్స్ అడిగితే మిడిల్ ఫింగర్ చూపిస్తా అని స్వాతి వ్యాఖ్యానించారు. మరో టాటూ వేయించుకోవాల్సి వస్తే మా ఆయనకు మాత్రమే కనిపించి... ఇంకెవరికీ కనిపించని ప్లేసులో వేసుకుంటాను అని స్వాతి తెలిపారు.

నేను చేసే పిచ్చి పని

నేను చేసే పిచ్చి పని

నేను చేసిన పిచ్చి పని మనుషులకు ఎక్కువ ఛాన్సెస్ ఇస్తాను. మనుషులను ఈజీగా నమ్మేస్తాను. దాని వల్ల తర్వాత చాలా ఇబ్బంది పడతాను అని స్వాతి చెప్పుకొచ్చారు.

సెక్స్ టేప్ బాధించింది

సెక్స్ టేప్ బాధించింది

నన్ను బాగా బాధించిన రూమర్స్ కలర్స్ చేస్తున్నపుడు సెక్స్ టేప్ రూమర్. దీంతో పాటు పన్ను మీద పన్ను ఉండటం వల్ల నా గురించి ప్రతి ఒక్కరూ లొకేషన్లో రకరకాలు మాట్లాడుకున్నారు. ఇప్పటికీ క్యారెక్టర్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తట్టుకోలేనని తెలిపారు.

నవ్వించిన రూమర్

నవ్వించిన రూమర్

బాగా నవ్వించిన విషయం... రెమ్యూనరేషన్ ఇంత చార్జ్ చేస్తుంది, అంత చార్జ్ చేస్తుందని వచ్చే రూమర్స్. అవి నిజం కావాలని కోరుకుంటున్నాను.

అవన్నీ పట్టించుకోవద్దు

అవన్నీ పట్టించుకోవద్దు

తెలుగు హీరోయిన్స్‌కు ఇచ్చే సలహా.... మీ చుట్టూ ఉన్న వారు చాలా మంది చాలా సలహాలు ఇస్తారు. తెలుగు అమ్మాయివి నువ్వు, నీకు రిజర్వేషన్స్ ఉండకూడదని. అవన్నీ పట్టించుకోకుండా మనసుకు నచ్చింది చేయండి. ఎలాంటి ప్రెషర్లో అనవసరమైన స్ట్రెస్ తీసుకోకండి.

నిఖిల్ అలాంటోడు కాదు

నిఖిల్ అలాంటోడు కాదు

నిఖిల్‌తో ఉన్న ఫోటోస్ ట్విట్టర్లో పెడుతూ ఉంటారు. అవి రూమర్స్‌కు కారణం అవుతాయేమో అనే ప్రశ్నకు స్వాతి స్పందిస్తూ.... నిఖిల్ నా ఫ్రెండ్. ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తను నా వెల్ విషర్ కూడా అని స్వాతి స్పష్టం చేశారు.

English summary
Colors Swathi about her personal life after marriage. Swathi Reddy is an Indian film actress and television presenter who predominantly works in Telugu Cinema along with Tamil and Malayalam films. Her nickname Colors Swati comes from her stint in the Telugu television show Colours, in the year 1996 which was telecast on Maa TV rose her fame.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more