రీ ఎంట్రీకి సిద్దమైన కలర్స్ స్వాతి.. మళ్ళీ ఇన్నాళ్లకు అగ్ర నటీనటులతో కలిసి కొత్త ప్రయోగం
కలర్స్ స్వాతి అంటే తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు. పదహారేళ్ళ వయసులోనే చిరునవ్వుతో కుర్రాళ్ళను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీని ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. కేవలం నటిగానే కాకుండా మంచి యాంకర్ గా కూడా కొన్నాళ్ళు కెరీర్ ను కొనసాగించింది. ఇక హీరోయిన్ గా ఎక్కువా కాలం నిలవలేకపోయిన స్వాతి పెళ్లి అనంతరం బిగ్ స్క్రీన్ కు చాలా గ్యాప్ ఇచ్చింది. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ బడా నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.

ఆ ప్రోగ్రామ్ ద్వారా..
కలర్స్ స్వాతి గురించి బుల్లితెర అభిమానులకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మా టీవీ కలర్స్ ప్రోగ్రామ్ అనే టాక్ షోతో ఎంతో మంది ఆడియెన్స్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో టీనేజ్ అమ్మాయిలాంటి క్యారెక్టర్లు చేసింది. ఇక డేంజర్ సినిమాలో అలాగే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాల్లో కూడా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా
మరికొన్నాళ్లకు మెయిన్ హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం వంటి భాషల్లో కూడా మంచి ఛాన్సులు అందుకుంది. అనంతపురం అనే తమిళ్ రీమేక్ సినిమాతోనే స్వాతికి మంచి ఛాన్సులు వచ్చాయి. నాని మొదటి సినిమా అష్టా చమ్మా కూడా ఆమెకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది.

రెమ్యునరేషన్ కోసం ఆశ పడకుండా
ఇక స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంది. స్వాతికి ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా కేవలం తనకు నచ్చిన సినిమాలనే ఒకే చేసుకుంటూ వెళ్లింది. రెమ్యునరేషన్ కోసం కూడా ఆశ పడకుండా తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే చేసింది.

పెళ్లి అనంతరం..
ఇక పెళ్లి అనంతరం వెండితెరకు చాలా గ్యాప్ వచ్చింది. చివరగా ఆమె తెలుగులో లండన్ బాబులు అనే సినిమాలో నటించింది. ఇక ఆ తరువాత నచ్చిన వాడితోనే ప్రేమ వివాహం చేసుకున్న స్వాతి విదేశాలకు వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ చాలా కాలం తరువాత ఆమెకి ఆఫర్స్ వస్తున్నాయని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్దమైంది.

అగ్ర నటులతో మళ్ళీ ఇన్నాళ్లకు..
హర్ష పులిపాక అనే యువ దర్శకుడు తెరకెక్కించనున్న పంచతంత్రం అనే ఒక ప్రయోగాత్మకమైన సస్పెన్స్ సినిమాలో కీలక పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమాలో బ్రహ్మానందం, సముద్రఖని వంటి అగ్ర నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే నేటితరం టాలంటేడ్. నటీనటులు కూడా ఆ సినిమాలో నటిస్తున్నట్లు ఒక స్పెషల్ వీడియో ద్వారా తెలియజేశారు.


Click it and Unblock the Notifications











