‘పెళ్లి చేసుకోవడం కంటే.. కుక్కను పెంచుకోవడమే బెటర్’
చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో విడాకులు, బ్రేకప్స్ వంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలకు కూడా సెలబ్రిటీలైనా విడిపోతున్నారు. ఎప్పుడు ఏ జంట విడాకుల ప్రకటన చేస్తారోనని సినీవర్గాలు, అభిమానులు టెన్షన్ పడుతుంటారు. ఇక పెళ్లిపై నటీనటుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. తాజాగా హీరోయిన్ కలర్స్ స్వాతి.. పెళ్లి, రిలేషన్‌పై గతంలో చేసిన వ్యాఖ్యల తాలూకా వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
కలర్స్ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా పాపులరైన కలర్స్ స్వాతి.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. డేంజర్ సినిమాతో నటిగా మారిన ఆమె.. అష్టాచెమ్మతో బ్రేక్ అందుకున్నారు ఈ సినిమా విజయం సాధించడంతో కలర్స్ స్వాతికి అవకాశాలు క్యూకట్టాయి. కలవరమయే మదిలో, గోల్కొండ హైస్కూల్, స్వామిరారా, బంగారు కోడిపెట్ట, కార్తీకేయ, త్రిపుర, లండన్ బాబులు, పంచతంత్రం, మంత్ ఆఫ్ మధు సినిమాలలో నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ చిత్రాల్లోనూ సత్తా చాటారు స్వాతి.

కెరీర్ పీక్స్‌లో ఉండగానే కేరళకు చెందిన వికాస్ వాసు అనే కుర్రాడితో ప్రేమలో పడిన స్వాతి.. అతనిని పెద్దల అంగకారంతో 2018 ఆగస్టులో పెళ్లి చేసుకుంది. అయితే కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ పేజిలో భర్తతో కలిసున్న ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో స్వాతి- వికాస్‌లు విడాకులు తీసుకోబోతున్నారా అన్న పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్స్‌ని స్వాతి ఖండించారు. పెళ్లికి ముందు ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలర్స్ స్వాతి.. వివాహం, భార్యభర్తల సంబంధంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువగా వచ్చాయని యాంకర్ ప్రశ్నించగా.. అబ్బాయిలు చాలా క్లవర్. వాళ్లు కొంతమంది అమ్మాయిల్ని ఐ లవ్ యూ అని పడిపోతుందని తెలుసు.. కొంతమంది దగ్గర నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే పడిపోతారు. వాళ్ల ప్రకారం నేను హోమ్లీ గర్ల్. తెలుగు అమ్మాయిని, బొట్టు పెట్టుకుని వచ్చాను కదా అలా దానికి ఫిక్స్ అయిపోయారు. స్వాతిని పటాయించాలంటే పెళ్లి అనే అనాలి.. లేదంటే రాదు, మొండిది. అందుకే ఐ విల్ మ్యారీ యూ.. విల్ యూ మ్యారీ మీ అని అడుగుతారు. దానికి నో థ్యాంక్స్ చెప్పేస్తా. అయినా నేను అరెంజ్ మ్యారేజే చేసుకుంటా.. నాకు అంత ఓపిక లేదు, ఎప్పుడు అరెంజ్ చేస్తే అప్పుడు చేసుకుంటానని కలర్స్ స్వాతి తెలిపారు.
అమ్మానాన్నలకు పెళ్లి గురించి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. నేను చాలా పెళ్లిళ్లు చూశా.. అసలు మొగుడు, పెళ్లాలు ఎందుకు అనిపిస్తుంది. పబ్లిక్‌లో చూస్తే నాకంటే ఎక్కువగా నటిస్తారు. చేతులు పట్టుకుని వదలరు.. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నట్లుగా ఉంటారు. నాకొచ్చే ఎస్ఎంఎస్‌లు మాత్రం తేడాగా ఉంటాయి. ఇంత హిపోక్రసి నాకొద్దు, నేను కుక్కపిల్లను పెంచుకుంటాను. అమ్మానాన్నల్ని చూసుకుంటాను, చివరి వరకు నేను వాళ్లతోనే ఉంటాను. కానీ వాళ్లు మాత్రం నాతో రివర్స్ గేమ్ ప్లే చేశారు.. ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరిగిపోవాలని చెప్పేవారు. ఇంకా సరేనని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని కలర్స్ స్వాతి పేర్కొన్నారు.
6 నెలలు నా చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.. మంచోడు వస్తాడో? చెడ్డవాడు వస్తాడో కానీ అంతా మన తలరాత, అబద్దాలు చెప్పేవాళ్లు.. సైకోలు కనిపిస్తారు. రియల్ లైఫ్‌లో చాలామంది సైకోలను చూశా.. వర్క్ చేశా. దాంతో పెళ్లి వద్దు అనుకున్నా.. కానీ మా నాన్న, మా చిన్నాన్న వంటి మంచోళ్లు కూడా ఉంటారని సర్దిచెప్పుకున్నా. నేను వర్కింగ్ ఉమెన్‌ని, ఇండిపెండెంట్‌గా ఉండాలనుకునే టైపు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అమ్మానాన్నల సపోర్ట్ ఉంటుందనే అరెంజ్ మ్యారేజ్‌ని ఇష్టపడతా. ఏమైనా అయితే మీరే పెళ్లి చేశారు, మీరే వాడిని తీసుకొచ్చారని చెప్పడానికి ఉంటుంది అని కలర్స్ స్వాతి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పాత వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications