'ది కాశ్మీర్ ఫైల్స్' యూనిట్ తో కలర్స్ స్వాతి మూవీ.. పెళ్లి తరువాత ఇన్నాళ్ళకు రీ ఎంట్రీ.. పోస్టర్ వైరల్

చూడగానే చిరునవ్వుతో అందరినీ ఎంతగానో ఆకట్టుకునే అందాల స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న స్వాతి కొన్నాళ్ళ వరకు వరుస సినిమాలతో బిజీ గా కనిపించింది. అయితే స్వాతి రెడ్డి 5 ఏళ్ల క్రితం నుంచి ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. ఆమె పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇక మళ్లీ ఇన్నాళ్లకు కాశ్మీర్ ఫైల్స్ యూనిట్ తో కలిసి ఒక డిఫరెంట్ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తోంది. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

అలా సినిమాల్లో..

అలా సినిమాల్లో..

సాధారణంగా స్వాతి అంటే ఎవరు ఆమెను గుర్తు పట్టరు. కానీ కలర్ స్వాతి అంటే మాత్రం ఆమె అందమైన చిరునవ్వు ప్రతి ఒక్కరిలో అలా మదిలో మెదులుతూ ఉంటుంది. అప్పట్లో కలర్స్ షో ద్వారా స్వాతి గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆమె టీనేజ్ వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిష చెల్లెలిగా ఆమె నటించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

భాషతో సంబంధం లేకుండా..

భాషతో సంబంధం లేకుండా..

టీనేజ్ వయసు నుంచి తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ వచ్చిన కలర్స్ స్వాతి 17 ఏళ్ళ తరువాత మెయిన్ హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో కనిపించింది. భాషతో సంబంధం లేకుండా తమిళం మలయాళం ఇండస్ట్రీలో కూడా నటించింది. ఆమె కొన్ని పురస్కారాలను కూడా అందుకుంది.

 ఆ సినిమాలతో

ఆ సినిమాలతో

మొదట నాని తో నటించిన అష్టా చమ్మ ఆమె కెరీర్ను సరికొత్త మలుపు తిరిగింది. ముఖ్యంగా నిఖిల్ తో నటించిన స్వామి రారా సినిమా కలర్స్ స్వాతికి అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తరువాత మళ్ళీ అదే హీరోతో చేసిన కార్తికేయ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించింది దీంతో స్వాతి కి మరిన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ ఆమె తొందరపడకుండా కేవలం తనకు పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంది.

లేడి ఓరియెంటెడ్ సినిమాలలో..

లేడి ఓరియెంటెడ్ సినిమాలలో..

ఎక్కువ గ్లామర్ జోలికి వెళ్లకుండా మంచి తెలుగు నటిగా ఆమె వెండి తెరపై కనిపించే ప్రయత్నం చేసింది. స్వాతి అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకునే కలర్స్ స్వాతి కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. కానీ ఆ సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి.

 పెళ్లి తరువాత

పెళ్లి తరువాత

2017 లో చివరగా లండన్ బాబులు అనే సినిమాలో కనిపించిన కలర్ స్వాతి మళ్లీ ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపించింది లేదు. ఆమె 2018 లోనే వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లి పోయింది. ఇక ఆ తర్వాత ఒకసారి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ లో కనిపించిన కలర్ స్వాతి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాను అని కూడా తెలియజేసింది.

 ఆ సినిమాతో రీ ఎంట్రీ..

ఆ సినిమాతో రీ ఎంట్రీ..

ఇక ఇన్నాళ్లకు ఆమె ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇటీవల ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశంలోనే హాట్ టాపిక్ గా నిలిచిన ఆ చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ది కాశ్మీరు ఫైల్స్ సినిమాతో ఇటీవల మంచి గుర్తింపును అందుకున్న అభిషేక్ నామా నిర్మిస్తున్న ఇడియట్స్ అనే సినిమాలో కలర్స్ స్వాతి ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేయగా సోషల్ వీడియోలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రాజెక్టులో నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ శర్మ, శ్రీ హర్ష కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆదిత్య హసన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X