Rakhi Sawant : అందుకే బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నా.. సినిమా అవకాశాలం కోసం ఎన్నో పాట్లు
సినిమా పరిశ్రమ అంటే గ్లామర్ ప్రపంచం. మరీ ముఖ్యంగా మహిళలకు గ్లామర్ ఉన్నంత వరకే అక్కడ చోటు. ఒక్కసారి ఫేడవుట్ అయితే వారిని పట్టించుకునే నాథుడు ఉండడు. అందుకే హీరోయిన్లు అందం కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు. కొంతమంది సర్జరీలు కూడా చేయించుకుంటారు. బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ 16 ఏళ్ల వయసులోనే ఓ సర్జరీ చేయించుకుందట. ఓ వ్యక్తి సలహా మేరకు సర్జరీ చేయించుకుని తన వక్షోజాల సైజు పెంచుకుందట.

ఆరంభంలో ఎన్నో కష్టాలు
`బాలీవుడ్‌లో చోటు సంపాదించాలని కలలు కన్నాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు అనుభవించాను. బాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే మంచి షేప్ ఉండాలని చెప్పారు. ఆ సమయంలో నేను సరైన రీతిలో లేను. దీంతో నేను సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. బ్రెస్ట్ సర్జరీతో పాటు లైపో సెక్షన్ కూడా చేయించుకున్నా. బ్రెస్ట్ సర్జరీ అనేది ఓ భయంకర అనుభవం. ఆ సమయంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌లు సైతం సర్జరీలు చేయించుకున్నార`ని రాఖీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్
బాలీవుడ్‌లో సినిమాలతో కంటే ఇతర వివాదాలతోనే రాఖీ సావంత్ ఎక్కువగా పాపులర్ అయింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటింది. ఆ తర్వాత నటిగా, డాన్సర్‌గా పలు భాషల సినిమాల్లో నటించింది. హిందీ బిగ్‌బాస్-15 రియాల్టీ షోతో సూపర్ పాపులర్ అయిపోయింది. బాలీవుడ్‌లోని సాటి నటుల గురించి రాఖీ తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది. శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయినపుడు రాఖీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వాలంటైన్స్ డే రోజు బ్రేకప్
ఎన్నారై అయిన రితేష్‌తో వివాహ బంధంలో ఉన్న రాఖీ ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున బాంబు పేల్చింది. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించింది. తమ మధ్య ఏర్పడిన విభేదాలను తొలిగించేందకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, అవేవీ ఫలప్రదం కాకపోవడంతో ఇకపై కలిసి జీవించకూడదనే నిర్ణయానికి వచ్చామని రాఖీ తెలిపింది. కలిసి జీవిస్తూ రోజు గొడవలు పడటం కన్నా, విడిపోవడమే ఉత్తమం అని తమకు అనిపించిందని పేర్కొంది.

విరుష్క జోడీపై హాట్ కామెంట్‌తో సంచలనం
అనుష్క విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో రాఖీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. `కొత్తగా పెళ్లి అయిన అనుష్క-విరాట్ జంటకు కండోమ్ కానుకగా ఇవ్వాలని ఉంద`ని రాఖీ వ్యాఖ్యానించింది. తను ఇచ్చేవి స్పెషల్ కండోమ్స్ అని, వాటిని విరుష్క జోడీకి గిఫ్ట్‌గా ఇచ్చి వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుందామనుకున్నానని రాఖీ చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనం రేపాయి.
Recommended Video

హీరోయిన్ కాదు.. ఐటెమ్ గాళ్
తనకు హీరోయిన్ అయ్యే టాలెంట్ లేదని, హీరోయిన్‌గా తాను పనికి రానని, ఐటెమ్ గాళ్ గానే తనకు మంచి గుర్తింపు వచ్చిందని రాఖీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తన గొప్ప నటిని కాదని, అన్ని రకాల భావాలు పలికించలేనని, ఐటెమ్ గాళ్‌గా మాత్రమే రాణించగలనని రాఖీ పేర్కొంది. ఐటెమ్ గాళ్‌గా సంపాదిస్తున్న డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆమె చెప్పింది.


Click it and Unblock the Notifications











