వివాదంలో చిక్కుకున్న త్రిష సినిమా.. నాలుగేళ్ల క్రితమే!
త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 96. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజగా ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది.
96 చిత్ర కథ తనది అంటూ ఆర్ విచు అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఈ కథని తాను నాలుగేళ్ల క్రితమే రూపొందించానని, అప్పట్లో ఈ కథని నిర్మాత నందగోపాల్ కు వినిపిస్తే రిజెక్ట్ చేశారని తెలిపాడు. కానీ ఇప్పుడు వేరే దర్శకుడిని పెట్టుకుని అదే కథతో సినిమా తెరెక్కించారని విచు ఆరోపణలు చేస్తున్నాడు.

విచు ఆరోపణలపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించే నటీనటుల్ని ఇంకా ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











