గరిటి తిప్పేస్తున్న మిల్కీ బ్యూటీ... తినాలా చూడాలా అంటూ నెటిజన్ల డౌట్...
ఎడా పెడా సినిమాలు చేసేస్తూ సూపర్ బిజీగా కాలం గడిపేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా, లాక్ డౌన్ వల్ల ఒక్కసారిగా డల్ అయిపోయిందని అనుకుంటే పొరపాటే. తనని తాను బిజీగా ఉంచుకుంటూ శరీరికంగానే కాదు, మానసికంగానూ ధృఢంగా ఉండటం ఎలానో ఈ వైట్ బ్యూటీనే చూసి నేర్చుకోవాలి. అందుకే లాక్ డౌన్ సమయంలో కొత్త విద్యను నేర్చుకని దాన్ని సద్వినియోగం చేసుకుంది అమ్మడు.
ఇంతకూ అమ్మడు నేర్చుకున్న కొత్త విద్య ఏంటంటారా? ఆమె కెరీర్ కు ఉపయోగపడేలా ఏ కొత్త డాన్సో నేర్చుకుని ఉంటుందిలే అని అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఇంతకూ తమన్నా నేర్చుకున్న కొత్త విద్య ఏంటంటే వంటా వార్పు. వినడానికి కాస్త విడ్డూరంగానే ఉన్నా, ఇదే నిజం. ఎందుకంటే ఈ విషయాన్ని అమ్మడే నేరుగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

బిజీ షెడ్యూల్ వల్ల ఎప్పడూ వంటింటి జోలికే పోని తమన్నా, లాక్ డౌన్ పుణ్యమాని అక్కడే ఎక్కువ కాలం గడుపుతోందట. ఇక నలభీమపాకంలో ఓ పట్టు పట్టేందుకు కసరత్తులు చేస్తోంది. మొదట్లో కాస్త కష్టం అనిపించినా, క్రమంగా వంటింటిపై పట్టుసాధించిందట మన మిల్కీ బ్యూటీ. అంతేకాదు, వంటింటిని ఏకంగా హోటల్ గా మార్చేసి రోజుకో వెరైటీ వండేస్తోందట.
ఇలా అయితే, రేపు షూటింగ్ మొదలయ్యాక కూడా అమ్మడు గరిటె వదిలిపెట్టేలాలేదు. ఏమైనా, మిల్కీ బ్యూటీ ఇంత అందంగా వండి వార్చేస్తుంటే, జనాలు తినాలా చూడాలా అన్న డైలమాలో పడటం ఖాయం అని మాత్రం చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











