ఆ హీరోని ఒక్క మాట అనలేదు.. నాది ఐరన్‌లెగ్ అంట.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్
చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య సమానత్వం ఉండదని.. హీరోలకు దక్కే మర్యాద, గౌరవం తమకు ఉండదని ఎంతో మంది హీరోయిన్లు వాపోతూ ఉంటారు. హీరోలు ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు హీరోయిన్లకు మాత్రం గీచిగీచి బేరాలు ఆడతారని ఆరోపించారు. ఆఖరికి సెట్‌లో వ్యానిటీ వాన్ వాడుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిందేనని భామలు వాపోతున్నారు. ఇదే కాదు.. సినిమా ఫ్లాప్ అయితే హీరోలకు మరో ఛాన్స్ ఉంటుందని కానీ హీరోయిన్లను ఎవ్వరూ పట్టించుకోరని చెబుతున్నారు. సినిమా హిట్ అయితే హీరోల ఖాతాలో వేస్తారని అదే ఫ్లాప్ అయితే హీరోయిన్లను కూడా బాధ్యలను చేస్తారని ఉదాహరణలతో సహా చెప్పారు. తాజాగా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు స్టార్ హీరోయిన్ శృతిహాసన్.
కమల్ కూతురైనా అవమానాలే
భారతదేశం గర్వించదగ్గ మహానటుడు కమల్ హాసన్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు శృతిహాసన్. తండ్రి అడుగుజాడల్లో హే రామ్ చిత్రంలో బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టారు శృతి. ఆ తర్వాత లక్ అనే హిందీ చిత్రంతో పూర్తి స్థాయి హీరోయిన్‌గా టర్న్ అయ్యారు. స్టార్ హీరో కూతురు అయినప్పటికీ ఆమె జీవితం నల్లేరుపై నడకలా సాగలేదు. తొలినాళ్లలో ఆమె నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో శృతిహాసన్‌పై ఐరన్ లెగ్ ముద్రపడింది. అవమానాలు, చీత్కారాలను తట్టుకుని నిలబడిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత 3, గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో గోల్డెన్ హ్యాండ్ అనిపించుకున్నారు శృతిహాసన్.

శృతి డైరీ ఫుల్
ఆ తర్వాత హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్నారు శృతి. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆమె పలు చిత్రాలలో నటించారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్‌ల కూలీ మూవీలో నటిస్తున్నారు శృతి. దీనితో పాటు ఇళయ దళపతి విజయ్ చివరి చిత్రం జన నాయగన్, పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ సరసన సలార్ 2, విజయ్ సేతుపతితో ట్రైన్ సినిమాలలో నటిస్తున్నారు శృతి. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాలు కథా చర్చలలో ఉన్నాయి. ఈ లైనప్‌తో ఆమె పేరు సౌత్‌లో మారుమాగుతోంది.
కూలీ కోసం శృతి వెయిటింగ్
అన్నింటికి మించి కూలీ కోసం శృతి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇందులో లోకేష్ కనగరాజ్ ఆమెకు ఎలాంటి పాత్ర ఇచ్చారు? అనే ఉత్కంఠ నెలకొంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల అవుతుండగా కూలీ యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మీడియాకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కెరీర్ తొలిరోజులను గుర్తు చేసుకుంది.
ఆ హీరోని ఒక్క మాట అనలేదు
తాను నటించిన అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ సినిమాలు వెంట వెంటనే ఫ్లాప్ అయ్యాయని శృతి చెప్పారు. నాటి నుంచి అందరూ తాను ఐరెన్ లెగ్ అనడం మొదలు పెట్టారని.. కానీ ఆ రెండు సినిమాలలో సిద్ధార్ధే హీరో అని తనను మాత్రం ఎవ్వరూ ఏమీ అనలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ సార్‌తో చేసిన గబ్బర్ సింగ్‌తో తాను సక్సెస్ అందుకున్నానని.. ఈ చిత్రం తర్వాతి నుంచి తనను అంతా గోల్డెన్ లెగ్ అని పిలవడం మొదలు పెట్టారని శృతి హాసన్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











