కరోనా ఎఫెక్ట్: ప్రధాని నిధికి సహాయం.. సారా అలీ ఖాన్ రికార్డు..
కరోనావైరస్‌తో కష్టాల్లో మునిగిపోయిన దేశ ప్రజలను ఆదుకోనే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి బాలీవుడ్ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. తమకు తోచినంతగా వారు ప్రధాని నిధికి, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిధులను, విరాళాలను అందజేస్తున్నారు. ఆ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ సారా ఆలీఖాన్ తమ విరాళాలన్ని ప్రకటించడమే కాకుండా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. బాలీవుడ్‌లో PM CARES Fund కు విరాళం అందించిన అతిపిన్న వయసు గల బాలీవుడ్ తారగా రికార్డును సొంతం చేసుకొన్నది.
PM CARES Fund కు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతు బాధ్యతగా విరాళాన్ని అందించాను. ఇలాంటి ఆపద కాలంలో ప్రతీ ఒక్కరు ముందుకొచ్చి తమ వంతు సహాయం అందించాలి. ప్రతీ ఒక్కరి విరాళం కరోనాపై పోరాటానికి అండగా నిలుస్తుంది అని సారా ఆలీ ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

ఆపద సమయంలో పేదలకు సహాయం అందించడానికి సరైన సమయం. సహాయం అందించడం ద్వారా నిరుపేదలకు ఆహారం అందించడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమానికి అండగా నిలువండి. తమ వంతు బాధ్యతగా విరాళం ప్రకటించండి అంటూ సారా మరో మెసేజ్‌ను పెట్టారు.


Click it and Unblock the Notifications











