రామాయణం థీమ్ దుపట్టాతో కృతి సనన్.. ఆదిపురుష్ కోసం ధరించిన డిజైనర్ శాలువా ఖరీదెంతో తెలుసా?
బాలీవుడ్ భామ కృతిసనన్ ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. సంప్రదాయ దుస్తుల్లోనైనా, మోడరన్ దుస్తుల్లోనైనా అందాల ప్రదర్శించడంలో ఆమె పెట్టింది పేరు. తాజాగా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తున్నది. సీతగా తనదైన శైలిలో ఆకట్టుకొన్న ఈ భామ తాజాగా ధరించిన దుపట్టా సోషల్ మీడియాలో అందర్నీ ఆకర్షించింది. ఆమె ధరించిన దుపట్టా శాలువా ఖరీదు గురించి చర్చనీయాంశమైంది. ఆ దుపట్టా శాలువ ధర ఎంతంటే?
ఆదిపురుష్ చిత్రంలో సీతగా కనిపించిన కృతిసనన్ సినిమా ప్రమోషన్స్‌లో సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకొన్నారు. చేతితో తయారు చేసిన చీరలు, అనార్కలిస్, డిజైనర్ లంగాలో కనిపించారు. క్రీమ్ కలర్ దుస్తుల్లో కనిపించిన ఈ భామ తన ఎదపై భాగంపై దుపట్టా లాంటి శాలువాను కప్పుకొన్నారు. ఆ దుపట్టా అందర్నీ ఆకట్టుకొన్నది.

ఆదిపురుష్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాను ధరించిన దుస్తులకు సంబంధించిన ఫోటోషూట్‌ను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాను ధరించిన దుపట్టా చేతితో తయారు చేసిన పాష్మినా షాల్ అని చెప్పుకోచ్చింది. ఈ దుపట్టాను చాలా మంది నేతలు సుమారు 6 గంటలపాటు కష్టపడి తయారు చేశారు అని తెలిపారు.
భారతీయ నేతలు తయారు చేసిన అరుదైన దుపట్టా ఇది. చాలా అద్బుతంగా డిజైన్ చేశారు. రామాయణాన్ని దుపట్టాపై చూపించారు. ఈ శాలువాపై రామాయణంలోని కొన్ని సీన్లను చిత్రీకరించారు. మీరే చూడండి.. ఎంత అందంగా తయారు చేశారో అని కృతి సనన్ చెప్పారు.
ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్ సంస్థ షాజా ఈ పాష్మినా షాల్‌ను డిజైన్ చేసింది. ఆయోధ్య కథలను చెప్పే పాష్మీనా షాల ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. దీని ఖరీదు సుమారు 11 లక్షల రూపాయలు అనే విషయాన్ని నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











