Manchu Lakshmi బయటకు వెళ్లి అలా చేస్తుందనుకోలేదు.. వైరల్ అవుతున్న కాస్ట్యూమ్ డిజైనర్ పోస్ట్!
నటి, నిర్మాత మంచు లక్ష్మికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె ఎక్కువగా ట్రోల్ అవుతుంటారు. సోషల్ మీడియాలో ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టినా నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్వతహాగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన ఆమె మీడియాలో, సోషల్ మీడియాలో కూడా చాలా సరదాగా ఉంటారు. అయితే ఆమె మంచితనాన్ని తాజాగా టాలీవుడ్ కి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ నిహారిక రెడ్డి బయటపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే

పట్టించుకోకుండా
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కుమార్తెగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన మంచు లక్ష్మి తొలుత టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా అమెరికాలో పెరిగిన ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ కొంచెం మనకంటే భిన్నంగా ఉంటుంది. అందుకే ఆమె మాట్లాడిన కొన్ని ఇంగ్లీషు పదాలను తీసుకుని నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఆమె మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటారు.

సుదీర్ఘ పోస్టు
తొలుత యాంకర్ గా ఆ తర్వాత నటిగా, నిర్మాతగా కూడా ఆమె తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించింది మాత్రం లక్ష్మి టాక్ షో తో అని చెప్పాలి. ఆ తర్వాత మేము సైతం అనే ఒక కార్యక్రమం కూడా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను తన అనుభవాలను ఎప్పటికప్పుడు ఆమె పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె మంచితనం గురించి తెలుగు సినీ పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న నిహారిక రెడ్డి ఒక సుదీర్ఘ పోస్టు ద్వారా వెల్లడించారు.

చేతికి డబ్బులు
'లక్ష్మి మంచు'ని ఓ డిజైనింగ్ వర్క్ మీద కలిశాను, ఆమెను కలిసినప్పుడు మెజర్మెంట్స్ కోసం మా మాస్టర్ కూడా వచ్చారు. ఆయన్ని చూడగానే ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల క్రితం వారిద్దరూ కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన యోగక్షేమాలు ఆమె అడుగుతుంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయారు. కాసేపటికి బొటిక్ కి వచ్చాక ఆయన ''మేడం నేను వెళ్లిపోతుంటే లక్ష్మీ గారు కిందకి వచ్చి మా పిల్లల గురించి అడిగి వారికి ఏమైనా కొనుక్కొని వెళ్ళు అని నా చేతికి డబ్బులు ఇచ్చారండి'' అని చెప్పారని పేర్కొన్నారు.
ఊహించలేదు
నిజానికి ఆయన వెళ్లిపోతున్న సమయానికి తాను, లక్ష్మీ పైన మాట్లాడుతూ ఉన్నామని, మధ్యలో ఆమె కంగారుగా బయటకు వెళ్లారని, అలా వెళితే ఏదైనా ఫోన్ కాల్ మాట్లాడడానికి వెళ్ళారేమో అనుకున్నాను కానీ మా మాస్టర్ కోసం వెళ్తారని ఊహించలేదు, అప్పుడు అమ్మ తత్వం అర్ధం బోధపడింది నాకు, ఎంత గొప్ప మనసు ఉండాలి అలా గుర్తుపెట్టుకుని మరీ ఒక వ్యక్తి కుటుంబం గురించి కూడా ఆలోచించాలి అంటే అంటూ తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందిన విషయం ఇదేనని చెబుతూ ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ట్రోలింగ్ చేయడం సులభం
ఎవరి గురించైనా ట్రోలింగ్ చేయడం, వెటకారం చేయడం చాలా సులభం, ఆ విషయం మనకి చాలా ఇష్టం కూడా ! చాలామంది సినిమా వాళ్ళ గురించి వాళ్ళు చేసే మంచి కాకుండా ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకుని వెటకారం చేస్తూ ఉంటారు. కానీ ఒకరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా అలా చేయడం చాలా తప్పు అని నిహారికా రెడ్డి తన పోస్టులో పెంచుకున్నారు.


Click it and Unblock the Notifications











