అందుకే పవన్ కల్యాణ్ కు ఓటేయలేదు.. కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి
తెలుగు సినిమా దగ్గర కొత్త నటీనటులు ఎప్పుడూ కొత్త కాదు అని తెలిసిందే. ట్రెండ్ మారుతున్న కొద్దీ కొత్త సరుకు వస్తూనే ఉంటుంది. అయితే హీరో హీరోయిన్స్ విషయం పక్కన పెడితే వారికి యంగ్ ఏజ్ లో కనిపించే టీనేజ్ నటీనటులు కూడా తెలుగు సినిమా దగ్గర షైన్ అయ్యినవారు చాలా మందే కనిపిస్తారు.
కాగా ఇలా టాలీవుడ్ లో ప్రెజెంట్ జెనరేషన్ లో కూడా పలువురు యువ నటీనటులు ఉండగా ఇటీవల తెలుగు సినిమా దగ్గర ఒక్క సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న నటి శ్రీదేవి ఆపళ్ళ అని చెప్పవచ్చు. కాగా నాచురల్ స్టార్ నాని ఇపుడు పట్టిందల్లా బంగారం అవుతుంది. అది తాను నటించిన సినిమా అయినా నిర్మాణం వహించిన సినిమా అయినా చెప్పేందుకు మంచి ఉదాహరణే బ్లాక్ బస్టర్ చిత్రం 'కోర్ట్'.

కాగా ఈ చిత్రంలో ఈ టీనేజ్ బ్యూటీ ఫీమేల్ లీడ్ లో కనిపించింది. మరి తెలుగు అమ్మాయి కూడా కావడంతో ఆమెకి ఈ ఒక్క సినిమా తోనే మంచి ఆదరణ కూడా వచ్చేసింది. ఇటీవల ప్రమోషన్స్ లో కూడా మంచు హుషారుగా కనిపించిన ఈ యువ నటి తెలుగు సినిమాలో తనకి ఆల్ టైం ఫేవరెట్ హీరో ఎవరో రివీల్ చేసేంది. ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి తెలుగు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం అని ఆమె తెలిపింది.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందుకు చిన్న ఉదాహరణ కూడా చెప్పింది. చాలా వరకు పవన్ కి ఉన్న అభిమానుల్లో కేవలం సినిమా పరంగా మాత్రమే అభిమించి పొలిటికల్ గా వేరేగా ఉండే ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఈ యువ నటి రెండు విషయాలలో కూడా పవన్ కే సపోర్ట్ అంటుంది.
తనకి వయసు సరిపోక ఇంకా ఓట్ హక్కు రాలేదు కానీ ఉంటే ఖచ్చితంగా లాస్ట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కే ఓట్ వేసేదాన్ని అని చెబుతుంది. అయితే అలా అని డిజప్పాయింట్ కాలేదట. తన ఓటు హక్కు లేకపోయినా ఉన్నవారితో తనకి తెలిసిన వారు అందరితో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయించాను అని తెలిపింది. దీనితో ఈ కామెంట్స్ విన్న పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా ఈ యంగ్ నటి కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారిపోయాయి.
ఇక ప్రస్తుతం కోర్ట్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు అందుకొని ఇపుడు 50 కోట్ల గ్రాస్ దిశగా వెళుతుంది. అలాగే యూఎస్ మార్కెట్ లో కూడా 1 మిలియన్ డాలర్స్ కి వెళుతుంది. మొత్తానికి ఇలా నాని మాత్రం తన కెరీర్లో అటు హీరోగా ఇటు నిర్మాతగా కూడా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇక రానున్న రోజుల్లో తన నుంచి హిట్ 3, ది ప్యారడైజ్ చిత్రాలు రానున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











