జాన్వీకపూర్ ఇంట్లో మరో ఇద్దరికి కరోనా.. ఫ్యామిలీని వెంటాడుతున్న వైరస్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కుటుంబాన్ని కరోనావైరస్ వెంటాడుతున్నది. రెండు రోజుల క్రితం తమ ఇంట్లోని పనిమనిషికి కరోనావైరస్ సోకిందని నిర్మాత బోని కపూర్ వెల్లడించడంతో సినీ వర్గాలకు షాక్ తగిలింది. అలా ఆ ఘటన మరిచిపోకముందే తాజాగా మరో ఇద్దరికి కరోనావైరస్ సోకడం పరిస్థితి మరింత గంభీరంగా మారింది. అయితే బోని కుటుంబం అనుసరిస్తున్న జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలు..

బోని కపూర్ ఇంటిలో కలకలం

బోని కపూర్ ఇంటిలో కలకలం

కరోనా లాక్‌డౌన్ సమయంలో బోని కపూర్ తన కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో కలిసి ముంబైలోని లోకండ్‌వాలా ఇంటిలో ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం చరణ్ అనే పనిమనిషికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఇంటి సభ్యులందరూ, పనిమనుషులకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించారు. ఈ పరీక్షల్లో ఇద్దరికి కరోనావైరస్ రావడం ఆందోళనకు తెర లేపింది.

జాన్వీ, ఖుషీలకు నెగిటివ్

జాన్వీ, ఖుషీలకు నెగిటివ్

రెండు రోజుల క్రితం పనిమనిషి చరణ్‌ను క్వారంటైన్‌కు పంపించి వెంటనే జాన్వీ, ఖుషీలకు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ అని ఫలితాలు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. అయితే అంతలోనే మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఇంటి సభ్యులందరూ భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే ఇంటిని, ఇంట్లోని వస్తువులను సానిటైజ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

బోని ప్రకటన కోసం..

బోని ప్రకటన కోసం..

గతంలో తన ఇంటిలోని పనిమనిషికి కరోనా సోకిన వెంటనే ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. తాజాగా తమ ఇంటిలో మరో ఇద్దరికి కరోనా సోకడంపై మున్సిపల్, ప్రభుత్వ అధికారులకు బోని కపూర్ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ ఘటనపై ఆయన ఇచ్చే ప్రకటన కోసం సినీ వర్గాలు, మీడియా వేచి చూస్తున్నాయి. ముంబైని కరోనా అతలాకుతలం చేస్తున్న సమయంలో బోని కుటుంబానికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అంతా క్షేమమే

ప్రస్తుతం అంతా క్షేమమే

కాగా రెండు రోజుల కిత్రం పనిమనిషికి కరోనా సోకిన వెంటనే బోని కపూర్ విడుదల చేసిన ప్రకటనలో యోగ క్షేమాలు వెల్లడించారు. తాను, తన పిల్లలిద్దరూ, సిబ్బంది క్షేమంగా ఉన్నారు. వారికి కరోనా లక్షణాలేవీ కనిపించడం లేదు. పని మనిషి విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, బాంబే మున్సిపల్ అధికారులు స్పందించిన తీరుక ధన్యవాదాలు అంటూ బోని తన ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X