అల్లు అర్జున్‌కి మళ్ళీ ఆ హీరోయిన్‌నే సెట్ చేసిన త్రివిక్రమ్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్ గా చెబుతున్నారు. మొదట బన్నీ లేకుండానే త్రివిక్రమ్ షూటింగ్ ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ లోపు అల్లు అర్జున్ తన లుక్ మార్చుకుని సరికొత్తగా కనిపించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం కోసం బరువు తగ్గి మరింత స్టైలిష్ గా మారాలని త్రివిక్రమ్ బన్నీకి సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల బన్నీ పొడవాటి హెయిర్ తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. డీజే చిత్రాల్లో అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ చిత్రంలో పూజా అందాల ఆరబోతతో యువత మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజ హెగ్డేని హీరోయిన్ గా ఫైనల్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేతలో కూడా పూజానే హీరోయిన్. ఆ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. ఈ సెంటిమెంట్ కూడా పూజ హెగ్డేని త్రివిక్రమ్ ఎంపిక చేసుకోవడానికి కారణం అనే వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











