అమర్ అక్బర్ ఆంటోనిలో సీనియర్ హీరోయిన్ చిన్నకూతురు.. చిన్ననాటి ఇలియానా!

Recommended Video

Amar Akbar Anthony Movie News Gets A Surprise News | Filmibeat Telugu

మాస్ మహారాజ రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీనువైట్ల ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీనువైట్ల వరుసగా ప్లాపులు ఎదుర్కొంటున్నాడు. ఈ చిత్రంతో తిగిరి పుంజుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు క్రేజీ హీరోయిన్ ఇలియానాకు ఇది రీఎంట్రీ చిత్రం. దాదాపు ఆరేళ్ళ తరువాత ఈ నడుము సుందరి తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఈ చిత్రంలో ఇలియానా చిన్ననాటి పాత్ర గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

చిన్ననాటి ఇలియానా

చిన్ననాటి ఇలియానా

ఈ చిత్రంలో ఇలియానా పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం పాటలకు, గ్లామర్ కు మాత్రమే పరిమితం కాకుండా ఇలియానా పాత్రకూడా కథలో భాగమట. మరో ఆసక్తికర వార్త ఈ చిత్రం గురించి వినిపిస్తోంది. సీనియర్ హీరోయిన్ లయ చిన్న కుమార్తె ఈ చిత్రంలో చిన్ననాటి ఇలియానాగా నటించింది.

వివాహం తరువాత

వివాహం తరువాత

వివాహం తరువాత లయ సినిమాలకు దూరమై భర్తతో పాటు యూఎస్ లో సెటిల్ అయిపోయింది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రం కూడా యూఎస్ లోనే జరగడంతో శ్రీనువైట్ల లయని సంప్రదించి ఆమె చిన్న కుమార్తెని చిన్ననాటి ఇలియానా పాత్రలో నటింపజేసినట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో లయ చిన్నకుమార్తె పాత్ర ఉంటుందని అంటున్నారు.

హోమ్లీ హీరోయిన్

హోమ్లీ హీరోయిన్

సీనియర్ హీరోయిన్ లయకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువగా అభిమానులు ఉన్నారు. హనుమాన్ జంక్షన్, స్వయంవరం, మిస్సమ్మ, విజయేంద్ర వర్మ వంటి చిత్రాలలో లయ నటించింది. హోమ్లీ హీరోయిన్ గా అలరించింది. లయ చివరగా నటించిన చిత్రం బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం.

అమర్ అక్బర్ ఆంటోని

అమర్ అక్బర్ ఆంటోని

ఇక అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో ఆరేళ్ళ తరువాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది. బాలీవుడ్ ఆమెకు అవకాశాలు బాగా సన్నగిల్లిపోయాయి. టాలీవుడ్ లో ఇలియానాకు క్రేజ్ తగ్గినప్పటికీ ఈ చిత్రం విజయం సాధించడం పైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X