యంగ్ హీరోయిన్ తో క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్.. ఫైనల్ గా తేల్చేశారు?
సెలబ్రెటీల జీవితం సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. తమ జీవితాల్లో ఏం జరుగుతున్నదనేది తమకంటే ఇతరులకే ఎక్కువ ఆసక్తికరంగా మారుతుంటుంది. రంగుల ప్రపంచంలో ఉన్న తారల గురించి ఎప్పుడూ ఏదోక గాసిప్ నడుస్తూనే ఉంటుంది. తమ సినిమాల గురించి, వ్యక్తి గత విషయాల గురించి తమకు తెలియని వారు కూడా తెగ మాట్లాడేస్తూ ఉంటారు. మరికొందరైతే హద్దులు దాటేసి మరీ రూమర్లు క్రియేట్ చేస్తుంటారు. అలా అని వచ్చే రూమర్లన్నీ అబద్ధాలు అని చెప్పడానికి కూడా లేదు. అయితే తాజాగా బాలీవుడ్ కు చెందిన యంగ్ బ్యూటీ స్టార్ క్రికెటర్ తో ప్రేమలో పడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గురించి ఇప్పుడు బీటౌన్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ లోని యంగ్ బ్యూటీతో ఈ క్రికెటర్ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తూన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. పలు సందర్భాల్లో వీరు తరుచూగా కలుస్తున్నారంటూ కూడా రూమర్లు తెగ వ్యాప్తి చెందాయి.

ఇంతకీ సిరాజ్ డేటింగ్ చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు ఎవరితోనో కాదు. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న యంగ్ బ్యూటీ, హిందీ బిగ్ బాస్ ఫేమ్ మహిరా శర్మ కావడం విశేషం. వీరిద్దరూ కొన్నాళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ రూమర్లు పుటుకొస్తున్నాయి. ఇటీవల రోజుకో న్యూస్ వైరల్ అవుతుండటం గమనార్హం. దీంతో వీరిద్దరూ తమ డేటింగ్ రూమర్లపై తాజాగా రియాక్ట్ అయ్యారు. తాము ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రూమర్లను ఖండించారు. తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులను ఇలా క్లారిటీ ఇస్తూ పుకార్లకు చెక్ పెట్టారు.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ మహిరా శర్మతో డేటింగ్ అంటూ వస్తున్న రూమర్లకు ఇన్నాళ్లు మహ్మద్ సిరాజ్ స్పందించలేదు. ఇక తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. అది కూడా సోషల్ మీడియా వేదికన ఇలా స్పందించారు... ప్రతి ఒక్కరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా పాపారాజిలకు స్పెషల్ రిక్వెస్ట్. నన్ను ఇంకెలాంటి ప్రశ్నలు అడగకండి. అది అంతా పూర్తి అవాస్తవం. ఎలాంటి ఆధారంలేని. ఇంతటితో ఇది ఆగిపోతుందని ఆశిస్తున్నాను... అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు.
మరోవైపు డేటింగ్ రూమర్లపై యంగ్ బ్యూటీ మహిరా శర్మ కూడా డేటింగ్ రూమర్లపై ఇలా స్పందించింది.... దయచేసి డేటింగ్ రూమర్లను ఆపేయండి. నేను ఎవరితోసూ డేటింగ్ చేయడం లేదు... అంటూ బదులిచ్చింది. ఇలా ఇద్దరూ స్పందించడంతో రూమర్లకు చెక్ పడింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫొటోషూట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ వయస్సు ప్రస్తుతం 27 ఏళ్లు. జమ్మూ కాశ్మీర్ లో పుట్టి పెరిగింది. టెలివిజన్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ ద్వారా మహిరా శర్మ చాలా క్రేజ్ దక్కించుకుంది.



Click it and Unblock the Notifications











