ఊర్వశి రటేలాకు షాకిచ్చిన యువ క్రికెటర్.. వాట్సప్‌లో బ్లాక్ చేసి బ్రేకప్.. ఆ ప్రియుడు ఎవరంటే!
క్రికెటర్లకు, సినీ తారలకు లింకుల సర్వసాధారణమనే విషయాన్ని కొత్తగా చెప్పనక్కర్లేదు. రవిశాస్త్రికి అమృతాసింగ్ మధ్య, అజహర్‌కు సంగీతా బిజ్లానీకి మధ్య, చివరకు అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ మధ్య రిలేషన్‌షిప్ మధ్య ఎన్నో అఫైర్లు, డేటింగులు చూసి ఉంటాం. తాజాగా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు, ఊర్వశి రౌటేలాకు మధ్య జోరుగా వ్యవహారం నడిచిన విషయం గురించి తాజా ఓ ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. ఆ రొమాంటిక్ వ్యవహారం ఏమింటంటే..

రిషబ్ పంత్‌తో రొమాంటిక్‌గా
కొన్ని సంవత్సరాల క్రితం భారత జట్టులోని వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ఊర్వశి రటేలా ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. చాలా కాలం వారిద్దరి అఫైర్‌లో కొనసాగారు. వారిద్దరి డేటింగ్ వ్యవహారం 2018లో బయటకు లీక్ అయింది. ఆ కొద్ది రోజుల్లోనే వారిద్దరూ విడిపోయారు.

రిషబ్ పంత్, ఉర్వశి రటేలా మధ్య విభేదాలు
అయితే రిషబ్ పంత్, ఉర్వశి రటేలా మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో వారిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నదట. అయితే విభేదాలు మరింత ముదరడంతో ఉర్వశి వాట్పప్ అకౌంట్‌ను రిషబ్ బ్లాక్ చేశారట. అప్పట్లో ఈ వ్యవహారంపై మీడియాలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది.

ఇషా నేగితో రిషబ్ అఫైర్
ఊర్వశి రటేలాతో బ్రేకప్ తర్వాత రిషబ్ పంత్ మళ్లీ ప్రేమలో పడ్డారు. ఇషా నేగి అనే సెలబ్రిటీతో టేడింగ్ కొనసాగించారు. ఇషా నేగికి రిషబ్ పంపిన సందేశాలు ఇన్స్‌టాగ్రామ్‌లో నెటిజన్లను విశేషంగా ఆకర్షించాయి. రిషబ్‌ను ఉద్దేశించి.. నా మనిషి.. నా సోల్‌మేట్, మై బెస్ట్ ఫ్రెండ్, జీవితంలో వెలకట్టలేని లవ్ అంటూ ఇషా నేగి కామెంట్ చేసింది.
Recommended Video

సచిన్, కోహ్లీ అంటే నాకు ఇష్టం
ఇదిలా ఉండగా, ఇటీవల ఊర్వశి రటేలా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో లైవ్ ఛాట్ చేస్తూ నెటిజన్లతో ముచ్చటించింది. మీకు నచ్చిన క్రికెటర్ ఎవరని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. నేను క్రికెట్ చూడను. నాకు క్రికెటర్ల గురించి ఎక్కువగా తెలియదు. కాకపోతే నాకు సచిన్ టెండూల్కర్ సర్, విరాట్ కోహ్లీ సర్ అంటే చాలా ఇష్టం, గౌరవం అని అన్నారు.


Click it and Unblock the Notifications











