twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగనపై క్రిమినల్ కేసు ... కారణం ఇదే

    |

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ , మహా సర్కార్ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులపై క్వీన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ పై కర్ణాటకలోని తుమ్కూర్ జెఎంఎఫ్.సి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. ట్వీట్ లో నిరసనకారులను ఉగ్రవాదులు అంటూ అభివర్ణించడంతో ఆమెపై ఐపిసి సెక్షన్ 44.. 108.. 153.. 153 ఎ, 504 కింద కేసు నమోదైంది.

    ఇక అధికార భాజపా ఎన్డీయేకి కంగన వత్తాసు పలకడంపైనా చాలామంది సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రతిపక్ష నాయకులను ఉగ్రవాదులతో పోల్చడంతో ఒక్కసారిగా కంగనా పై మండిపడుతున్నారు. అటు ముంబైలో కంగన కార్యాలయం కూల్చివేతకు కారణమైన మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగన వ్యతిరేకంగా వెళుతోంది.

    Criminal Case Filed On Kangana

    ప్రస్తుతం ఆ కూల్చివేత వ్యవహారంపై కోర్టులో విచారణ సాగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం 2 కొట్ల రూపాయలను పరిహారం ఇవ్వాలని ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గతంలో ఆమె మహారాష్ట్ర ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ముంబైను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గా కంగనా అభివర్ణించిన విషయం తెలిసిందే .

    English summary
    criminal case registered against actress Kangana Ranaut as the actress allegedly demeaned the farmers protesting against the controversial farm bills. Ranaut referred to the protesting farmers as “terrorists”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X