‘మహిళల నుంచి కన్వత్వాన్ని ఆశించకండి.. ఒక్క రాత్రితో కోల్పోయే దాని కోసమా?’

దేశీ గర్ల్ స్టేటస్ నుంచి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్న ప్రియాంక చోప్రా జోనస్ తన కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. బాలీవుడ్‌లో తనకు ఎదురైన సవాళ్లను అధిగమించి స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని సొంతం చేసుకొన్నది. హిందీ సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని కాంక్రీట్ చేసుకొన్న ఈ అందాల సుందరి ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో హాలీవుడ్‌లో తన టాలెంట్ మెరుపులు మెరిపిస్తున్నది. అయితే ప్రియాంక చోప్రా గతంలో చేసిన వ్యాఖ్యలను దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ తాజాగా కోట్ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ పోస్టు వివరాల్లోకి వెళితే..

మీరు ఎవరినైనా భార్యగా స్వీకరించే ముందు ఆమె నుంచి కన్వత్వాన్ని కోరుకోవద్దు. మంచి ప్రవర్తన కలిగిన మహిళ కోసం చూడండి. కన్వత్వం అనేది ఒక్క రాత్రితో మహిళలు కోల్పోతారు. కన్వత్వం శాశ్వతం కాదు. ఎప్పటికీ ఉండేది శాశ్వతంగా మహిళతో తోడు ఉండేది ప్రవర్తన మాత్రమే అని ప్రియాంక చోప్రా అన్నారు. ఆమె చేసిన ట్వీట్‌పై నెటిజన్లు దారుణంగా రియాక్ట్ అయ్యారు.

Critic Umair Sandhu trolls Priyanka Chopra Jonas s Virginity comments

ప్రియాంక చేసిన సెన్సేషనల్ పోస్టుపై నెటిజన్ల ఘాటుగా రిప్లైలు ఇచ్చారు. ఆడవాళ్లు మగవాళ్ల ఆదాయం, డబ్బు గురించి చూడకూడదు. మంచి క్యారెక్టర్.. ప్రవర్తన మాత్రమే చూడాలి. కానీ మహిళలు అవేమీ చూడకుండా మగవాడి సంపాదనపై దృష్టి పెడుతారనే విధంగా ఆమె ట్వీట్‌పై రకరకాల కామెంట్స్ విసిరారు. అయితే అప్పట్లో ప్రియాంక పోస్ట్ వైరల్ అయింది.

అయితే తాజాగా ఉమేర్ సంధూ ప్రియాంక చోప్రా వర్జినిటీ కామెంట్స్‌పై పోస్టులు పెట్టి అసభ్యంగా పోస్టు చేశారు. అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్న ఆమె.. చివరకు నిక్ జోనస్‌తో సెటిల్ అయిపోయింది. అందుకే కన్యత్వం ముఖ్యం కాదని చెప్పింది. ఇది ఆమె వ్యవహారం అని ట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు.

Critic Umair Sandhu trolls Priyanka Chopra Jonas s Virginity comments

ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. చాలా సంవత్సరాల తర్వాత ఇండియన్ సినిమా చేసేందుకు సిద్దమయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రంలో ప్రియాంక కీలక పాత్రను పోషిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది. ప్రస్తుతం విదేశాల్లో జాన్ అబ్రహం, ప్రియాంకపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X