Eesha Rebba: ఈషా నవ్వితేనే మైండ్ బ్లాక్.. ఇక ఇలా గ్లామర్ డోస్ పెంచిందంటే.. స్టన్నింగ్!
చూడగానే ఎవరికైనా నచ్చేసే అందం ఆమెది. కానీ అదృష్టం కలిసిరాక తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆమె మరెవరో కాదు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ. తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ వల్లేనేమో ఆమెకు ఇక్కడ పెద్దగా చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు. కానీ, ఇతర భాషల్లో మాత్రం అదరగొడుతోంది. ఏవి పడితే అవి కాకుండా, తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ గుర్తింపు పెంచుకుంటుంది. ఇక అప్పుడప్పుడు గ్లామర్ హైలెట్ అయ్యేలా అమ్మడు స్పెషల్ ఫొటో షూట్స్ తో దర్శనమిస్తోంది. ఇక రీసెంట్ గా మరోసారి స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
సినిమాలు మాత్రమే కాకుండా : ఈషా రెబ్బ మొదట షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఆ తరువాత చిన్న బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు అందుకుని నటిగా మంచి గుర్తింపు అందుకుంది. ఇక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్ లతోనూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పిట్ట కథలు. త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది. ఈ రెండు వెబ్ సిరీస్ లు బాగా ఆకట్టుకున్నాయి.

బిగ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా : ఇదిలా ఉండగా, ఈషా 'అంతకు ముందు, ఆ తర్వాత' సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ మూవీ తో ఆమె అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వరసగా అవకాశాలు వస్తాయని అనుకుంది కానీ, రాలేదు. అరవింద సమేతలో సెకండ్ హీరోయిన్ గా నటిచింది. కానీ అది కూడా పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోవడంతో, మళ్లీ ఏ స్టార్ హీరో సినిమాలోనూ అవకాశం దక్కలేదు.

అక్కడ అవకాశాలు ఎక్కువగా : కానీ, తమిళంలో మాత్రం అవకాశాలు క్యూలు కడుతున్నాయి. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ ఆఫీసర్లుగా కనపడుతున్నారు. ఈ మూవీ క్లిక అయితే, ఆమెకు అక్కడ మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇలా విభిన్నమైన పాత్రలు చేసుకుంటే అమ్మడు ముందుకు సాగుతోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా : ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. నేటితరం గ్లామరస్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా తన రేంజ్ ను అయితే పెంచుకుంటోంది. అమ్మడు ఎలాంటి స్టిల్స్ ఇచ్చినా కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి.

మరోసారి గ్లామర్ డోస్ పెంచిన ఈషా : తాజాగా, క్యూట్ పిక్స్ షేర్ చేసింది. బ్లూ, పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ లో మెరిసింది. స్లీవ్ లెస్ టాప్, క్లీవేజ్ లుక్ తో హాట్ గా కనపడుతోంది. అదేవిధంగా కింద స్కర్ట్ సైడ్ ఓపెన్ తో మరింత హాట్ గా కనిపిస్తుంది. టేబుల్ ముందు కూర్చొని, ముందు కాఫీ కప్పుతో పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. అందులో అమ్మడు తన లెగ్స్ అందాలను కూడా మతింత హైలెట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











