Pragya Jaiswal: వామ్మో ఇంతకంటే హీటెక్కించే లుక్ ఉంటుందా.. బికినీలో మైండ్ బ్లోయింగ్!
సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు అందుకోవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ కావడంతో ఆ రూట్లో కూడా హీరోయిన్స్ వారి క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బికినీ అందాలతో కూడా కొందరు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకుంటున్నారు.
ఇక అదే తరహాలో చాలాకాలంగా బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా తన ప్రయత్నాల్లో డోస్ పెంచింది. ఇక ఈ బ్యూటీ లేటెస్ట్ గా మరోసారి బికినీలో మైండ్ బ్లోయింగ్ అనేలా దర్శనమిచ్చింది. ఆ ఫోటోల వివరాలలోకి వెళితే..

కొన్ని విజయాలు వచ్చినా: మొదట క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది ప్రగ్యా జైస్వాల్. పూణేలో జన్మించిన బ్యూటీ మోడల్ గా క్రేజ్ అందుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2014 నుంచి కొనసాగుతున్న ప్రగ్యా బాక్సాఫీస్ వద్ద కొన్ని మంచి విజయాలను సొంతం చేసుకుంది. కానీ వాటికి తగ్గట్టుగా అయితే మరో స్థాయికి మాత్రం వెళ్లలేకపోయింది.

ఆ సినిమాతో మంచి గుర్తింపు: ఇక ఈ బ్యూటీ 2014లో మొదట ఒక తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది ఇక తర్వాత వెంటనే మరొక హిందీ సినిమా కూడా చేసింది. అయితే అవి ఏవి కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అనంతరం మిర్చి లాంటి కుర్రాడు.. అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ క్రిష్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన కంచె సినిమా మాత్రం అమ్మడికి మంచి విజయాన్ని ఇచ్చింది. నటిగా కూడా ఆమెకు గుర్తింపు వచ్చేలా చేసింది.

వరుసగా సినిమాలు చేస్తూ: అయితే కంచె లాంటి సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఆమెకు మళ్ళీ అలాంటి పాత్రలు అయితే దక్కలేదు. ఎక్కువగా కమర్షియల్ సినిమాలలోనే అవకాశాలు వచ్చాయి. ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు.. వంటి డిఫరెంట్ సినిమాలను చేసింది. కానీ అవి కూడా ఆమెకు పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు ఇక తర్వాత నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర.. లాంటి సినిమాలు చేసింది. కానీ అవి కూడా ఆమెకు కమర్షియల్ గా సక్సెస్ అయితే ఇవ్వలేకపోయాయి.

అఖండతో హిట్ కొట్టిన తరువాత: ఇక 2021లో నందమూరి బాలకృష్ణతో చేసిన అఖండ సినిమా మాత్రం ప్రగ్యా రేంజ్ ను మరింత పెంచేసింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. అయితే వెంటనే తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని అనుకుంది. ఇక ఇంతలో ఆమె ఓకే చేసిన సన్నాఫ్ ఇండియా సినిమా మాత్రం దారుణంగా దెబ్బ కొట్టింది.
బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా: అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా ప్రగ్యా మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలతో దర్శనమిస్తోంది. రీసెంట్ గా అమ్మడు మరోసారి బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపించింది.
ప్రగ్యా జైస్వాల్ గతంలో కూడా బికినీలో కనిపించింది కానీ ఈసారి అంతకుమించి అనేలా హీటెక్కించింది అని నెటిజన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ మాత్రం ఎక్కువగా గ్లామర్ తోనే సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటుంది. మరి ఈ రూట్లో అమ్మడికి ఏవైనా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











