Vedhika: బికినీ కంటే అందమైన ఫొటో వదిలిన వేదిక.. రోజురోజుకు హద్దులు దాటేస్తోందిగా..
చాలా వరకు హీరోయిన్స్ వచ్చిన మొదట్లో డీసెంట్ లుక్స్ తో కనిపించి ఆ తరువాత మెల్లమెల్లగా గ్లామర్ ప్రపంచానికి అలవాటు పడతారు. కొంత ఆలస్యమైనా సరే గ్లామరస్ బ్యూటీగా నెటిజన్లకు బాగా దగ్గరైన బ్యూటీలలో వేదిక కూడా టాప్ లిస్టులో ఉంటుంది. వేదిక ఇటీవల కాలంలో ఎలాంటి ఫొటోలు షేర్ చేసినా కూడా వైరల్ అవుతున్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. ఇక ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటో వివరాలలోకి వెళితే..
అసలు పేరు ఏమిటంటే: వేదిక అసలు పేరు పూజా కుమార్. ఆకర్షణీయమైన నటనతో అలాగే అందంతో వేదిక నమ్మకమైన అభిమానులను సంపాదించుకుంది. ప్రతిభావంతులైన కళాకారిణిగా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటోంది. తన కెరీర్ మొత్తంలో, ఆమె విభిన్న పాత్రలను పోషించడంతో తొందరగానే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వేదిక 2006లో "మద్రాసి" చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో తన నటనా రంగ ప్రవేశం చేసింది.

మొదట్లో సక్సెస్ రాకున్నా: మొదటి చిత్రం కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ, ఆమె నటనతో ఆకట్టుకుంది. టాలెంట్ తోనే ఆ తరువాత మరిన్ని అవకాశాలను అందుకోవడం ప్రారంభించింది. ఇక బాలా దర్శకత్వంలో వచ్చిన "పరదేశి" (2013) చిత్రంలో ఆమె అంగమ్మ పాత్ర ఆమెకు విస్తృతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. స్వాతంత్య్రానికి పూర్వం పల్లెటూరి అమ్మాయిగా ఆమె చేసిన పాత్ర ఆమెకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది.

ఆల్ రౌండర్ అని నిరూపించింది: "పరదేశి"లో విజయం సాధించిన తరువాత, వేదిక "కావియ తలైవన్" (2014), "జేమ్స్ & ఆలిస్" (2016), మరియు "కాంచన 3" (2019) వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీరియస్ డ్రామాలు, రొమాంటిక్ కామెడీలు, హారర్ చిత్రాలను చేయడంతో ఆల్ రౌండర్ అని నిరూపించింది. ఇక ఆమె రెమ్యునరేషన్ కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది.

ఇతర ఇండస్ట్రీలలో కూడా: వేదిక తెలుగు, మలయాళం కన్నడతో సహా ఇతర దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలలో కూడా వరుసగా సినిమాలు చేసింది. మలయాళ సినిమాల్లో "శివలింగ" (2016) "వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు" (2016), కన్నడ సినిమాలో "వినోధన్" (2017) వంటి చిత్రాలలో బాక్సాఫీస్ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది.

గ్లామర్ తో మాత్రం ఎల్లప్పుడూ షాక్ ఇస్తూనే ఉంది: ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా వేదిక తన గ్లామర్ తో మాత్రం ఎల్లప్పుడూ ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఆమె పొట్టి వస్త్రాలు ధరించి కుర్రాళ్ళను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా మరోసారి అమ్మడు స్టన్ అయ్యేలా మరో స్టిల్ ఇచ్చింది. ఇంతకంటే హాట్ స్టిల్ లో ఇదివరకే కనిపించినప్పటికి కూడా అమ్మడు ఇందులోనే చాలా హాట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరోసారి లెగ్స్ అందాలు, నడుము సొగసులు: పొట్టి నిక్కరులో లెగ్స్ అందాలు మొత్తం వైరల్ అయ్యేలా అమ్మడు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ఇక నడుము అందాలు మొత్తం అందంగా కనిలించేలా మరో స్టిల్ ఇచ్చింది. ఇక ఆమె చూపులు మరో లెవెల్లో ఉండడంతో మొత్తంగా ఈ ఫొటో అయితే నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. ఇక వేదిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కన్నడ, తమిళంలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇక తెలుగులో కూడా అమ్మడు మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications











