Aisha Sharma: సోదరి కంటే ధీటుగా గ్లామర్ డోస్ పెంచుతున్న బ్యూటీ.. అలాంటి డ్రెస్సులో ఘాటుగా
ఇటీవల కాలంలో హీరోయిన్స్ మాత్రమే కాకుండా వారి సోదరీమణులు కూడా గ్లామర్ డోస్ ఒకేసారి పెంచుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అయితే అందులో సక్సెస్ అయిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. చిరుత సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమె సోదరీ ఆయేషా శర్మ కూడా గ్లామరస్ ఫోటోలతో నిత్యం సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉంటుంది. ఇక లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. బికినీ అందాల కంటే గాటుగా ఆమె దర్శనం ఇచ్చింది ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..
అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు: నేహా శర్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమా చిరుత సినిమాలో అవకాశం దక్కించుకొని అప్పట్లో గ్రాండ్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె అదృష్టాన్ని చూసి అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. మెగా తనయుడి మొదటి సినిమాలో ఛాన్స్ రావడం అంటే అంత మాములు విషయం కాదు. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఆ అవకాశం కోసం పోటీపడ్డారు. కానీ ఆమె దురదృష్టం ఏమిటో గాని ఆ సినిమా తర్వాత మళ్ళీ కొత్తగా కనిపించలేదు.

అక్క తరహాలోనే బిజీ అవ్వాలని..: అయితే నేహా శర్మ సోదరి ఐషా శర్మ కూడా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. మోడల్ గా మాత్రం మొదట్లోనే అందరిని ఎంతగానో ఆకర్షించింది. ఎన్నో ఫ్యాషన్ బ్రాండ్ కు కూడా ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించింది. ఇక ట్రెండ్ అయ్యేవిధంగా ఫోటోషూట్స్ లో పాల్గొనడం లో కూడా ఈ బ్యూటీ చాలా బిజీగా ఉంటుంది.

చేసింది ఒక్క సినిమానే..: ఇక 2019లో శర్మ మొదటిసారి ఒక చిన్న సినిమాలో అవకాశం దక్కించుకుంది. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు ఆగిపోయింది. ఇక తర్వాత మళ్లీ జాన్ అబ్రహం నటించిన సత్యమేవ జయతే అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనే ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా కూడా అసలు ఏమాత్రం సక్సెస్ కాలేకపోయింది.

సోషల్ మీడియాలో తన గ్లామరస్ అందాలతో..: బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే ఈ బ్యూటీకి డిజాస్టర్ ఎదురవడంతో ఆ తర్వాత మళ్లీ పెద్దగా అవకాశాలు రాలేదు. సోదరి తరహాలోనే ఆమె కూడా చాలా కాలం పాటు ఖాళీగా కనిపించింది ఇక ఆ ఈ బ్యూటీ ఆ మధ్యలో ఒక వెబ్ సిరీస్ లో నటించిన బిజీగా ఉన్నా లేకపోయినా కూడా అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామరస్ అందాలతో జనాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది.

దిమ్మ తిరిగిపోయే లుక్..: ఇక రీసెంట్ గా మరోసారి ఒక బ్లాక్ డ్రెస్ లో తన అందాలను చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. గతంలో బికినీలో కూడా ఈ బ్యూటీ దిమ్మ తిరిగిపోయేలా కనిపించింది. కానీ ఈసారి అంతకంటే స్టన్ అయ్యే లుక్కుతో దర్శనమిచ్చింది. మరి ఈ ఘాటైన సొగసులతో అమ్మడు రాబోయే రోజుల్లో ఏమైనా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఆమె సోదరి నేహా శర్మ మాత్రం బిజీ అవుతుంది.


Click it and Unblock the Notifications











