Priya Prakash Varrier: కనుసైగతో సెన్సేషన్ చేసిన ఆ అమ్మాయి.. బెడ్ పై తొలిసారిగా బోల్డ్ లుక్

సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతున్నారో ఊహించడం కష్టంగానే ఉంది. అయితే ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ ని కూడా ఫిదా చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనుసైగలతోనే కుర్రాళ్ళని తన మాయలో పడేసిన ఈ బ్యూటీ మళ్లీ చాలాకాలం తర్వాత సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా గ్లామర్ షో తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఊహించని లుక్కుతో దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఊహించని క్రేజ్

ఊహించని క్రేజ్

మలయాళం ఇండస్ట్రీకి చెందిన ప్రియా ప్రకాష్ వారియర్ మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. అయితే మొదట్లో ఈ బ్యూటీకి హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కానీ 2019లో మాత్రం ఒక చిన్న సినిమాతో ఊహించిన విధంగా మంచి క్రేజ్ అందుకుంది. సినిమా విడుదలకు ముందే ఆమెకు సంబంధించిన ఒక చిన్న క్లిప్ వీడియో అందరినీ షాక్ కు గురి చేసింది.

ఒక్క వీడియోతో..

ఒక్క వీడియోతో..

2019లో మలయాళంలో తెరకెక్కిన 'ఓరు ఆధర్ లవ్' అనే సినిమాలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ స్కూల్ అమ్మాయిగా తన బాయ్ ఫ్రెండ్ ని చూస్తూ కనుసైగలతో ఎంతో రొమాంటిక్ గా ప్రేమను వ్యక్తపరిచగా ఆ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలా లవ్లీగా ఉండడంతో ప్రముఖ సెలబ్రిటీలను కూడా ఎంతగానో ఎట్రాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో అప్పట్లో వీడియోకు మిలియన్ల వ్యూవ్స్ అయితే వచ్చాయి.

అల్లు అర్జున్ ఫిదా

అల్లు అర్జున్ ఫిదా

అల్లు అర్జున్ కూడా బ్యూటీ కను సైగలకు ఫిదా అయిపోయాడు ఎక్కడ చూసినా ఈ బ్యూటీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఆ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా వెళ్లడం జరిగింది.

సినిమా ఫ్లాప్

సినిమా ఫ్లాప్

అయితే ప్రియా ప్రకాష్ వారియర్ ఆ వీడియోతో తప్పిస్తే హీరోయిన్ గా మాత్రం సినిమాలతో సక్సెస్ కాలేక పోయింది. ఓరు ఆధర్ లవ్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఆ సినిమాను తెలుగులో కూడా భారీగా విడుదల చేశారు. కానీ నిర్మాతలకు మంచి లాభాలు అందించినప్పటికీ కూడా బయ్యర్లు నష్టపోయారు. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో యువత ఆ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

స్టన్నింగ్ ఫోటో

స్టన్నింగ్ ఫోటో

ఇక రీసెంట్ గా అమ్మడు గ్లామర్ తో ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. బెడ్ పై రెడ్ నెక్ టీ షర్ట్ లో క్లివేజ్ అందాలను అందంగా ప్రజెంట్ చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రియా ఈ విధంగా దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్ గా మారిపోయింది. మరి ప్రియా ప్రకాష్ వారియర్ ఈ లుక్స్ తో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

సినిమాలతో బిజీగానే..

సినిమాలతో బిజీగానే..

గత తేడాది ప్రియా ప్రకాష్ వారు నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. అనంతరం తేజ సజ్జతో చేసిన ఇష్క్ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మలయాళంలోనే రెండు సినిమాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X