బికినీలో కొత్త బంగారు లోకం హీరోయిన్.. తొలిసారి ఇంత దారుణంగా అందాల ఆరబోత
టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న హీరోయిన్లలో చాలా తక్కువ మంది మాత్రమే ఫస్ట్ మూవీతోనే హైలైట్ అవుతున్నారు. అలాంటి వారే మంచి మంచి ఆఫర్లను సైతం అందుకుంటున్నారు. అందులో శ్వేత బసు ప్రసాద్ ఒకరు. 'కొత్త బంగారు లోకం' అనే సినిమాతో సెన్సేషన్ అయిన ఈ అమ్మడు.. తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, వివాదాల్లో చిక్కుకుని గాడి తప్పేసింది. అలాంటిది సెకెండ్ ఇన్నింగ్స్‌లో వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో శ్వేత బసు ప్రసాద్ తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!
సంచలనం అయిన శ్వేత
శ్వేత బసు ప్రసాద్ 'మక్డీ' అనే మూవీతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'ఇక్బాల్' మూవీతో హీరోయిన్‌గా మారి చాలా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఈ మూవీతో శ్వేత సెన్సేషన్‌గా మారింది. దీంతో ఆ తర్వాత 'రైడ్', 'కాస్కో', 'కళావర్ కింగ్', 'ప్రియుడు', 'జీనియస్' వంటి చిత్రాలు చేసింది.

వివాదాలతో కెరీర్ బ్రేక్‌లు
ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ చాలా భాషల్లో సినిమా చేస్తున్నప్పుడే శ్వేత బసు ప్రసాద్ ఓ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేక్ పడిపోయింది. ఈ వివాదం నుంచి తేరుకున్న తర్వాత శ్వేత.. ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకుంది. కానీ, ఏడాదిలోపే వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.

సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ
వివాదాల కారణంగా ఇబ్బందులు పడ్డ శ్వేత బసు ప్రసాద్.. సెకెండ్స్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వెబ్ ఫిల్మ్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, తెలుగులోనూ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఓ తెలుగు మూవీకి కూడా సంతకం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్
కెరీర్ ఆరంభంలో ఎలానో ఇప్పుడు కూడా అలాగే ఆఫర్లను అందుకుంటోన్న శ్వేత బసు ప్రసాద్.. సోషల్ మీడియాలో సైతం యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. నిత్యం తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన అభిమానులను అలరిస్తూ సాగిపోతోంది.

అందాలను ఆరబోస్తూ
తనదైన రీతిలో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న శ్వేత బసు ప్రసాద్.. ఈ మధ్యన మాత్రం తరచూ తనదైన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే హాట్ షో చేస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఇలా తన గ్లామర్‌తో శ్వేత బసు ప్రసాద్ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతోంది. అదే సమయంలో క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

శ్వేత ఘాటు పిక్స్ వైరల్
బబ్లీ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బికినీ టైప్ డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోలో ఆమె అందాలు మొత్తం దర్శనమిస్తూ తెగ కవ్విస్తున్నాయి. ఫలితంగా శ్వేత బసు ప్రసాద్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











