Ritu Varma: ఒకప్పుడు నడుము కూడా చూపించని హీరోయిన్.. ఇప్పుడు మాత్రం హద్దులు దాటేసి బోల్డ్ షో!
సినిమా ప్రపంచంలో తెలుగు హీరోయిన్స్ కు ఎక్కువగా అవకాశాలు రావు అని అలాగే వారు గ్లామరస్ పాత్రలను అంతగా చేయరు అని కామెంట్స్ కు కొంతమంది హీరోయిన్స్ ఊహించిన విధంగా కౌంటర్ ఇస్తున్నారు. ఇక చిన్న సినిమాల ద్వారానే నటిగా మంచి గుర్తింపును అందుకున్న రీతు వర్మ కూడా ఇప్పుడు మెల్లగా గ్లామర్ హద్దులను చెరిపేస్తూ తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇక ఒకప్పుడు నడుము కూడా చూపించని ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం కాస్త లిమిట్స్ దాటేసి ఎద అందాలను మరింత బోల్డ్ ప్రజెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు అమ్మాయిగా..
బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రీతూ వర్మ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. హైదరాబాదులోనే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఆమె తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసింది. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మోడలింగ్ లో కూడా కొంతకాలం కొనసాగింది. ఇక రీతూ వర్మ మరికొన్నాళ్లకు చిన్న సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది.

మొదట్లో చిన్న పాత్రల్లో..
మొదట 2013లో రీతూ వర్మ జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత ఆమె మెల్లగా కొన్ని చిన్న సినిమాల్లో మెయిన్ హీరోయిన్ పాత్రలో నటిస్తూ వచ్చింది. ఇక ఆమెకు మొదటగా బ్రేక్ ఇచ్చింది మాత్రం పెళ్లిచూపులు సినిమా. విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

గ్యాప్ లేకుండా సినిమాలు
రీతు వర్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలో చేసింది. ఇక ఓవర్గం యువ హీరోలతో అయితే ఆమె మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా నిఖిల్ కేశవ సినిమా కూడా సక్సెస్ అయ్యింది. ఇక ఆ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈ బ్యూటీ కి మరో రేంజ్ కి వెళ్లే బాక్స్ ఆఫీస్ సక్సెస్ మాత్రం దక్కలేదు.

గ్లామర్ విషయంలో అలా..
అయితే మొదటి నుంచి కూడా రీతూ వర్మ గ్లామర్ విషయంలో మాత్రం హద్దులు దాటకుండా చాలావరకు సింపుల్ గానే హీరోయిన్ పాత్రలు చేస్తూ వస్తోంది. ఒకానొక సమయంలో ఆమె నడుము అందాలను కూడా చూపించడానికి ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. కేవలం మంచి కంటెంట్ ఉన్న పాత్రలను మాత్రమే చేయాలనుకున్నా ఇంతవరకు ఆ తర్వాత ఇప్పుడు మాత్రం మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్నట్లు అర్థమవుతుంది.

ఇప్పుడు హద్దులు దాటేలా..
ఇటీవల కాలంలో రీతూ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. లేటెస్ట్ గానే ఒక ఫోటోలో అయితే ఊహించని విధంగా తన ఎద అందాలతో ఆశ్చర్యాన్ని కలిగించింది. గ్లామరస్ స్టైల్ డ్రెస్ లో అమ్మడు మతిపోయే విధంగా స్టిల్ ఇచ్చింది అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో రీతూ వర్మ తప్పకుండా గ్లామరస్ పాత్రలలో కూడా నటించబోతున్నట్లుగా ఒక హింట్ అయితే ఇచ్చేసినట్లుగా అర్థమవుతోంది. మరి ఈ బ్యూటీకి ఆ రూట్లో ఏవైనా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











