హద్దులు దాటేసిన ప్రగ్య .. రెడ్‌ చెర్రీలా ఊరిస్తున్న బాలయ్య హీరోయిన్

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై విజయవంతంగా దూసుకెళ్తోంది. మూడు రోజులకే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించి ఆయనకు లక్కీ లేడీగా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ రేసులో దూసుకెళ్లిన ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత అడ్రస్ లేరు. కెరీర్ ఫేడ్ అవుట్ అయిపోయింది అనుకున్న సమయంలో , అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొని ఇప్పుడు మళ్లీ బిజీగా మారారు ప్రగ్యా జైస్వాల్. 1991 జనవరి 12న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు ప్రగ్య. పూణేలో లా చదివిన ఈ ముద్దుగుమ్మ చదువు పూర్తి చేసిన అనంతరం మోడలింగ్‌ వైపు అడుగులు వేశారు. మోడల్‌గా దేశంలోని పలు టాప్ బ్రాండ్స్‌కు చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించారు.

daaku maharaaj Fame Pragya Jaiswal PhotoShoot With red color lehenga Her latest photos here

ఈ ఫేమ్‌తో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్న ప్రగ్యా జైస్వాల్.. 2014లో విరుట్టు అనే తమిళ్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. 2015లో బిగ్‌బాస్ విజేత అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో తెలుగువారిని పలకరించారు ప్రగ్యా జైస్వాల్. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచెతో ప్రగ్యాకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో జమీందారు కుమార్తెగా రాయల్ లుక్‌లో మెస్మరైజ్ చేశారు ప్రగ్యా జైస్వాల్.

కంచె తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. ఫేడ్ అవుట్ అవుతున్న దశలో బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చిన అఖండతో రీ ఎంట్రీ ఇచ్చారు ప్రగ్యా. తాజాగా ఇప్పుడు డాకు మహారాజ్‌లో హీరోయిన్‌గా అవకాశం ఇవ్వగా.. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్తోంది. దీనితో పాటు అఖండ 2, టైసన్ నాయుడు చిత్రాల్లో ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.

ఈ ఏడాది ప్రగ్యా జైస్వాల్‌కు జీవితంలో మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోనుంది. డాకు మహారాజ్ హిట్ కొట్టడంతో ఒకటైతే.. ఈ సినిమా సరిగ్గా తన పుట్టినరోజైన జనవరి 12న రిలీజ్ అవ్వడం. దీంతో డాకు మహారాజ్ సక్సెస్‌మీట్‌లోనే ప్రగ్యా జైస్వాల్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా బాలయ్య ఆమెను ఆశీర్వదించారు. ఇక సినిమా హిట్ అయిన మూడ్‌లో ఉన్న ప్రగ్య.. తాజాగా రెడ్ కలర్ లెహంగాలో చేసిన ఫోటో షూట్‌ను సోషల్ మీడియాలో పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

More from Filmibeat

Read more about: pragya jaiswal movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X