శ్రద్దా శ్రీనాథ్ అందాల ధగధగ .. దాచి దాచని గ్లామర్ నడుమ టాటూ చూపిస్తూ గ్లామర్ షో!
హీరోయిన్లు అంటే గ్లామర్ షో, అందాల ఆరబోతకే పరిమితమవుతున్న ఈ రోజుల్లో కొందరు మాత్రమే తమ నటనతో సత్తా చాటుతున్నారు. నిత్యామీనన్, సాయిపల్లవి వంటి వారు తమ నటనతో పాటు వ్యక్తిత్వంతోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తారు శ్రద్ధా శ్రీనాథ్. స్కిన్ షోకు దూరంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు శ్రద్ధా శ్రీనాథ్. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్‌లో ప్రాధాన్యమున్న పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
కర్ణాటకకు చెందిన శ్రద్ధా శ్రీనాథ్ తండ్రి ఆర్మీ అధికారి కావడంతో వీరి కుటుంబం దేశంలోని పలు రాష్ట్రాలకు మారుతూ ఉండేది. భిన్న సంస్కృతుల మధ్య పెరగడంతో శ్రద్ధా శ్రీనాథ్‌పైనా ఆ ప్రభావం పడింది. ఆస్ట్రోనాట్ కావాలనుకున్న ఈ కన్నడ కస్తూరి తర్వాత మీడియా వైపు రావాలనుకున్నారు. లా చదవాలని అనుకుని కోర్సులో జాయిన్ అయ్యింది కూడా. 2015లో మలయాల చిత్రం కోహినూర్‌తో వెండితెరపై అడుగుపెట్టిన శ్రద్ధా శ్రీనాథ్.. ఆ తర్వాత యూటర్న్ అంటూ మాతృభాష కన్నడంలో ఛాన్స్ అందుకుంది.

నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాతో తెలుగు వారిని పలకరించిన శ్రద్ధ.. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జోడి, కృష్ణ అండ్ హిస్ లీలా, సైంధవ్, మెకానిక్ రాకీ రీసెంట్‌గా డాకు మహారాజ్‌లో కనిపించింది శ్రద్ధ. ప్రస్తుతం తమిళంలో ఆర్యన్ అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు. పదేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. దక్షిణాదిన అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కమర్షియల్ హీరోయిన్‌గా కన్నా.. మంచి నటిగానే గుర్తింపు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యమని శ్రద్ధా శ్రీనాథ్ పలుమార్లు చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నేను ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండనని చాలా మంది అనుకున్నారని.. కానీ వాటికి నేను స్పందించలేదని , పరిశ్రమలో నిలదొక్కుకుని వారికి నా నటనతోనే సమాధానం ఇవ్వాలని అనుకున్నానని ఆమె తెలిపారు. ఇండస్ట్రీలో తనకు ఏ గాడ్ ఫాదర్ లేరని.. ప్రతి సినిమా రిజల్ట్ నాకు పాఠమేనని శ్రద్ధా శ్రీనాథ్ చెబుతారు. ఫలితం గురించి ఆలోచించనని, 100 శాతం కష్టపడతానని ఆమె వెల్లడించారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రద్ధా శ్రీనాథ్ తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతోనే సెగలు రేపుతుంటారు. తాజాగా పట్టు చీరలో , స్లీవ్ లెస్ బ్లౌజ్ , మ్యాచింగ్ జ్యువెలరీతో చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. అన్నింటికి మించి ఎదపై టాటూ కనిపించేలా గ్లామర్ షోతో కవ్విస్తున్నారు శ్రద్ధ. ఇంకేందుకు ఆలస్యం ఈ ముద్దుగుమ్మ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











