ఇండస్ట్రీలో నన్ను కెలికే దమ్ముందా?.. ఊర్వశి రౌతేలా హాట్ కామెంట్స్
ఇపుడు నార్త్ నుంచి సౌత్ లో కూడా మంచి ఊపు ఊపుతున్న హిందీ హాట్ బ్యూటీస్ లో ప్రముఖ స్టార్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఒకామె అని చెప్పాలి. కాగా ఊర్వశి రౌతేలా పలు హిందీ సినిమాలు చేసినప్పటికీ మన సౌత్ లో వచ్చిన క్రేజ్ అండ్ స్టార్డం మాత్రం హిందీ సినిమాలో అందుకోలేకపోయింది.
దీనితో తెలుగు ఆడియెన్స్ అటెన్షన్ ని ఎప్పటికపుడు అందుకోవాలని చూస్తున్న ఈ హాట్ బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి బిగ్ బ్రేక్ ఇస్తే ఐటెం గర్ల్ నుంచి ఇపుడు దానితో పాటుగా టాలీవుడ్ లో నటిగా కూడా నటించే అవకాశాన్ని బాలయ్య తన లేటెస్ట్ డాకు మహారాజ్ తో అందించారు. కాగా ఇలా ఊర్వశి రౌతేలా సౌత్ లో మంచి ఫామ్ లో ఉండగా తనపై పలు కాంట్రవర్సీలు కూడా లేకపోలేవు.

మరి ఊర్వశి రౌతేలా నటించిన ఓ సినిమా నుంచి ప్రైవేట్ వీడియో లీక్ కావడం దాని వెనుక ఉంది ఎవరు అనేది రివీల్ చేయడం ఇటీవల హాట్ టాపిక్ గా కూడా మారింది. ఇక దీనితో పాటుగా ఇటీవల డాకు మహారాజ్ సక్సెస్ తర్వాత సైఫ్ అలీఖాన్ విషయంలో చేసిన కామెంట్స్ కి కూడా పలు విమర్శలు ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా ఊర్వశి రౌతేలా ఏదొక వార్తలో మంచి హాట్ టాపిక్ గా వినిపిస్తుండగా ఇపుడు మరో క్రేజీ స్టేట్మెంట్ తో వైరల్ గా మారింది.
ఈసారి తన అంద చందాల కోసం చెప్పుకొచ్చింది. తాను తన బ్యూటీ కోసం ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని చెబుతుంది. అలాగే తనకి దేవుడు ఇచ్చిన అందమే ఇది అని ఎలా పుట్టానో అప్పటి నుంచి అలానే పెరిగాను ఇదంతా సహజంగా వచ్చిందే అని చెబుతుంది. అలాగే మిగతా హీరోయిన్స్ కోసం నాకేం తెలీదు అన్నట్టుగా సెటైర్స్ కూడా వేసింది. ఇక ఇండస్ట్రీలో ఉండే పలు ఇబ్బందులు కోసం కూడా ఆమె హాట్ కామెంట్స్ చేసింది.
మామూలుగా సినీ పరిశ్రమలో ఊర్వశి రౌతేలా లాంటి బ్యూటీస్ పట్ల డెఫినెట్ గా కమిట్మెంట్ లాంటి వార్తలు వింటూనే ఉంటాం. కానీ ఇంట్రెస్టింగ్ గా తనని ఆ రకంగా ఎవరు టచ్ కూడా చెయ్యలేదు అన్నట్టు ఈమె చెబుతుంది. మరి మొత్తానికి అయితే ఊర్వశి తనపై తానే ఈ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటుంది. రీసెంట్ గా డాకు మహారాజ్ సాంగ్ విషయంలో ఏ రేంజ్ లో ట్రోల్స్ కి గురి కావాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే.
ఇలా ప్రస్తుతానికి అయితే వరుస హిట్ సాంగ్స్ తో ఊర్వశి రౌతేలా దూసుకెళ్తుండగా దాదాపు సౌత్ సినిమాలోనే తాను సెటిల్ అయ్యేలా కనిపిస్తుంది. మరి చూడాలి మున్ముందు ఈ హాట్ బ్యూటీ తెలుగులో ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుంది అనేది. ప్రస్తుతం అయితే హిందీలో కసూర్ పార్ట్ 2 అలాగే వెల్కమ్ టు ది జంగిల్ అలాగే బ్లాక్ రోజ్ అనే సినిమాల్లో నటిస్తుంది.


Click it and Unblock the Notifications











