Urvashi Rautela NetWorth: నిమిషానికి 1 కోటి రెమ్యునరేషన్.. ఊర్వశి రౌటేలా ఆస్తులు ఎన్ని కోట్లంటే?

దక్షిణాది, ఉత్తరాది సినిమా పరిశ్రమలో అద్బుతంగా రాణిస్తున్న యువతారల్లో ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నటిగా గ్లామర్ పాత్రలే కాకుండా స్పెషల్ సాంగ్‌లో నటిస్తూ తనకంటూ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొంటున్నది. తాజాగా ఆమె నటించిన డాకూ మహారాజ్ సినిమా సంచలన విజయం సాధించింది. ఇలా సక్సెస్‌ఫుల్ జర్నీని కొనసాగిస్తున్న ఊర్వశి రౌటేలా ఇటీవల అంటే ఫిబ్రవరి 25వ తేదీన తన పుట్టిన రోజును జరుపుకొన్నది. ఈ సందర్భంగా ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆమె నికర ఆస్తుల వివరాల్లోకి వెళితే..

ఊర్వశీ రటేలా తెలుగు సినిమాలతో బిజీగా మారిపోయింది. బ్లాక్ రోజ్ అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ ఇటీవలనటించిన వాల్తేరు వీరయ్య, బ్రో, ఏజెంట్, స్కంధ, డాకూ మహారాజ్ సినిమాల్లోని స్పెషల్ పాటలు ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ సినిమాలోని 3 నిమిషాల నిడివి ఉన్న పాటలకు నిమిషానికి 1 కోటి రూపాయలు తీసుకొన్నారనేది టాక్. ఆ పాటలు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించాయి. దాంతో ఆమె క్రేజ్ ఎంత మేరకు ఉంటుందనే విషయం స్పష్టమైంది.

Daaku Maharaaj Heroine Urvashi Rautela net worth and Remuneration details

ఇక ఓటీటీలో చోటు చేసుకొన్న వివాదంతో ఊర్వశి రౌటేలా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. డాకు మహారాజ్ సినిమా పోస్టర్ నుంచి ఊర్వశి రటేలా ఫోటోను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమైంది. జాతీయ మీడియాలో ఈ విషయం భారీగా చర్చకు దారి తీసింది. హిందీ, తెలుగులో పాపులర్ అయిన పాటతో మంచి రెస్పాన్స్ తెచ్చుకొన్న ఈ బ్యూటీ సన్నివేశాలను, ఫోటోలను తొలగించడం వివాదంగా మారింది.

ఇదిలా ఉండగా, ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా బాలీవుడ్ ర్యాపర్ ఆరీతో కలిసి స్టేడియంలో సందడి చేశారు. దబిడి దిబిడి పాటకు స్టెప్పులేస్తూ ఆమె క్రేజీగా మారింది. అలాగే సుకుమార్‌తో కలిసి మాట్లాడిన వీడియో ట్రెండింగ్‌గా నిలిచింది. ఇలా ఆమె తన పుట్టిన రోజుకు ముందు దుబాయ్‌లో హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది.

అటు వివాదాలు, సినిమాలతో నిత్యం మీడియాలో హాట్ టాపిక్‌గా ఉండే ఊర్వశీ రటేలా పేరిట భారీగా ఆస్తులు ఉన్నాయి. సినిమాలు, యాడ్స్, ప్రైవేట్ ఈవెంట్స్ ద్వారా ఆమె సంపాదనను అధికంగానే కూడగట్టుకొన్నది. ఓ ప్రముఖ ఆర్థిక సంస్థ వెల్లడించిన ప్రకారం.. ఆమె ఆస్తుల విలువ 250 కోట్ల రూపాయలు. ముంబైలో విలాసవంతమైన ఫ్లాట్, వాహనాలు ఆమె పేరిట ఉన్నాయి.

ఊర్వశీ రౌటేలా సినిమా కెరీర్ విసయానికి వస్తే.. ఆమె నటించిన తెలుగు చిత్రం బ్లాక్ రోజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇంకా హిందీలో వెలకమ్ టు ది జంగిల్, కసూర్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇంకా కొన్ని తెలుగు సినిమాలు కూడా ఆమె అంగీకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X