అలాంటి సీన్లకైనా సిద్ధం.. హాట్ హాట్ ఫోటోషూట్‌తో యువ హీరోయిన్ దక్షి
లాక్‌డౌన్‌లో హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో యువ హీరోయిన్ దక్షి గుత్తికొండ హంగామా చేశారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన కరోనావైరస్ చిత్రం ద్వారా అచ్చమైన తెలుగు అమ్మాయిగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా దక్షి తన వ్యక్తిగత, సినిమా విశేషాలు ఇలా పంచుకొన్నారు.

ఆర్జీవీ చేతుల మీదుగా ప్రేక్షకుల ముందుకు
ఆర్జీవీ తెరకెక్కించిన కరోనా వైరస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది దక్షి గుత్తికొండ. సినిమా రిలీజ్‌కు ముందే గ్లామరస్ ఫోటోషూట్‌తో సినీ వర్గాలను ఆకర్షించారు. సోషల్ మీడియాలో దక్షి ఫోటోలు వైరల్ కావడంతో ప్రేక్షకులు, నెటిజన్ల దృష్టిని కూడా తనవైపు తిప్పుకొన్నారు.

నా సోషల్ మీడియా ఇమేజ్‌కు పోలీకలు లేవు
దక్షి గుత్తికొండ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఉన్న నా గ్లామర్ ఇమేజ్‌కి సినిమాలో చేసిన పాత్రల ఎలాంటి పోలికలు లేవు. కరోనావైరస్ కుటుంబ పరమైన సినిమా. ఒక తెలుగు ఫ్యామిలీలో తమిళ కోడలిగా నటించాను. ఈ చిత్రంలో వంశీ చాగంటికి భార్య పాత్రలో కనిపిస్తాను అని దక్షి గుత్తికొండ తెలిపారు.

తొలి సినిమాతోనే డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్‌తో
నా మొదటి సినిమా కరోనావైరస్‌లోనే గ్లామర్‌కు ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించాను. అలాంటి డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్ చెయ్యటం ఛాలెంజింగ్‌గా అనిపించింది. కరోనా సమయంలో అవకాశాలు కష్టంగా మారాయి. అలాంటి సమయంలో తెలుగమ్మాయి అయిన నాకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన రాంగోపాల్ వర్మ ధన్యవాదాలు అని దక్షి తెలిపారు.
Recommended Video

పరిమితులు పెట్టుకోలేదంటూ..
తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు చేయాలన్నదే నా కోరిక. ఇలాంటి పాత్రలే చెయ్యాలని నాకంటూ పరిమితులేమి పెట్టుకోలేదు. ఒకవేళ కథ నచ్చితే ఏ తరహా పాత్ర అయినా పోషిస్తాను. అలాగే కథ డిమాండ్ చేస్తే గ్లామర్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కూడా సిద్దమే అని చెప్పింది.


Click it and Unblock the Notifications











