Fatima Sana Shaik: దంగల్ పాప హాట్ షో.. ఈ స్టిల్ ముందు బికినీ లుక్ కూడా దండగే..
దంగల్ సినిమాలో ఆమిర్ ఖాన్ తో పాటు లీడ్ రోల్ లో నటించిన ఫాతిమా సనా షేఖ్ ఎంతగా గుర్తింపును అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా అనంతరం ఆమెకు మళ్ళీ అలాంటి సక్సెస్ అయితే రాలేదు. అయినప్పటికీ ఏదో విభిన్నంగా ట్రై చేస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్స్ తో అప్పుడప్పుడు షాక్ ఇస్తోంది. ఇక ఇటీవల ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలను చూస్తే బికినీ కూడా దండగే అనిపించేంత అందంగా ఉన్నాయి. ఆ ఫొటోలపై ఒక లుక్కేస్తే..

చైల్డ్ ఆర్టిస్ట్ గా..
ఫాతిమా సనా షేఖ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినిమా కెరీర్ ను ప్రారంభించింది. 1997లో ఆమె అమీర్ ఖాన్ అజయ్ దేవగన్ నటించిన ఇష్క్ అనే కామెడీ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 2001 వరకు కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు అందుకుంది. అయితే ఎక్కువగా ఆమెకు అమీర్ ఖాన్ సినిమాలలోనే అవకాశాలు లభించాయి.

అప్పటి నుంచి నటిగా బిజీగా
ఇక తన ఉన్నత చదువులను పూర్తి చేసిన తర్వాత ఫాతిమా రెగ్యులర్ నటిగా ఇండస్ట్రీలో కొనసాగాలని అనుకుంది. అయితే బుల్లితెరపై కూడా ఆమెకు కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ అటువైపు పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఇక 2008 నుంచి ఆమె నటిగా బిజీగా మారిపోయింది. అయితే ఫాతిమా 2015లో ఒక తెలుగు సినిమా కూడా చేసింది కానీ అది విడుదల కాలేదు.

దంగల్ సినిమాలో..
ఇక ఆ తర్వాత అమిర్ ఖాన్ కథానాయకుడుగా నటించిన దంగల్ సినిమాలో గీతా ఫోగట్ పాత్రలో నటించింది. ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ స్థాయిలో యాక్షన్ ఎలివేషన్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకుంది. బాహుబలి తర్వాత అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

తొందరపడకుండా..
ఇక తర్వాత ఫాతిమాకు మళ్లీ కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుంది. కానీ ఆమెకు అనుకున్నంత స్థాయిలో అయితే ఆఫర్లు రాలేదు. మళ్లీ అమీర్ ఖాన్ తోనే థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్ళీ పెద్దగా అవకాశాలు రాలేదు.

అండమైన ఫొటో షూట్స్
ప్రస్తుతం ఆడపాదన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయను అని చెప్పకనే చెబుతోంది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న కొన్ని గ్రామరస్ ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇటీవల ఒక స్పెషల్ కలర్ ఫుల్ ఫోటో షూట్ లో తమ్ముడు ఎంతగానో ఆకట్టుకుంది.

బికినీలో కనిపించే..
అందులో ఆమె అందాన్ని చూసినవారు బికినీలో కనిపించే అందమైన హీరోయిన్స్ కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు అని పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఫోటోలు అయితే నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ ఇలాంటి గ్లామరస్ రోల్స్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











