డేంజరస్ హీరోయిన్‌కు కరోనావైరస్.. సోదరి, అమ్మమ్మలకు కూడా..
బాలీవుడ్ చిత్రం డేంజరస్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె తన నివాసంలోనే స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నారు. గత నెల పూణెకు వెళ్లిన ఆమె ముంబైకి తిరిగి వస్తూ కరోనావైరస్‌కు గురయ్యానని వెల్లడించారు. నటాషా సూరి తన గురించి తెలియజేస్తూ ..

పూణేకి వెళ్లి వస్తుండగా
నటాషా సూరి తన కరోనావైరస్ సోకడం గురించి వెల్లడిస్తూ.. ఆగస్టు ఆరంభంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పూణే వెళ్లాను. ఆగస్టు 3న ముంబైకి తిరిగి వస్తూ అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం, గొంతు నొప్పి రావడంతో పరీక్షలు చేయించుకొన్నాను. కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది అని మీడియాకు తెలియజేశారు.

నా సోదరి, అమ్మమ్మకు కూడా
నటాషా సూరికే కాకుండా ఆమె సోదరి, అమ్మమ్మకి కూడా కరోనావైరస్ సోకింది. దాంతో కుటుంబం మొత్తం తమ నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నారు. జ్వరానికి, దగ్గుకు సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నారు. ఇటీవలే వారికి పరీక్షలు నిర్వహించారు.. వాటి రిపోర్టులు త్వరలోనే రానున్నాయి.

డేంజరస్ చిత్రంలో నటాషా సూరి
ప్రస్తుతం ఆమె బిపాసబసు, కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి బాలీవుడ్ చిత్రం డేంజరస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె ఈ సినిమా ప్రమోషన్‌కు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే ఎంఎక్స్ ప్లేయర్ సిరీస్‌లో ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానున్నది. ఈ సినిమాను చాలా కష్టపడి చేశాం. ఆ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేకపోవడం బాధగా ఉంది అని నటాషా అన్నారు.

2006లో మిస్ ఇండియా విన్నర్
నటాషా సూరి విషయానికి వస్తే.. 2006లో మిస్ ఇండియా వరల్డ్ విన్నర్‌గా నిలిచారు. కింగ్ లైయర్ అనే చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బా బా బ్లాక్‌షిప్, వర్జిన్ భానుప్రియ, డేంజరస్ అనే బాలీవుడ్ చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











