పెళ్లికి రెడీ అయిన కీర్తి సురేష్: ఆ స్టార్ హీరోతోనా? బాయ్‌ఫ్రెండ్‌తోనా? ఇదిగో అసలైన క్లారిటీ
అదిరిపోయే అందం, అద్భుతమైన నటనతో సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ప్రేక్షకులకు అలరిస్తూ నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మహానటి కీర్తి సురేష్. టాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో సైతం హవాను చూపిస్తోన్న ఈ చిన్నది.. స్టార్‌డమ్‌తో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ పెళ్లి వార్తలు కొద్ది రోజులుగా హైలైట్ అవుతోన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ అమ్మడు తన వివాహం గురించి క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!
చిన్నప్పుడే మొదలెట్టి:చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన కీర్తి సురేష్.. మలయాళంలో 'గీతాంజలి' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే రామ్ పోతినేని హీరోగా చేసిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ సొంతమైంది.

నేషనల్ అవార్డు పట్టేసి:తెలుగులో కీర్తి సురేష్ 'నేను శైలజ' తర్వాత వరుస సినిమాలతో హడావిడి చేసింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మహానటి' మూవీలో కీర్తి టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా పేరు దక్కింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది.
బిజీగా.. దసరాతో హిట్:కీర్తి సురేష్ ఆరంభంలో మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ ఉత్సాహంతోనే గత ఏడాది వరుసగా 'గుడ్ లక్ సఖి', 'సర్కారు వారి పాట', 'వాషీ', 'సానీ కాయిదామ్' అనే సినిమాలు చేసి తన రేంజ్‌ను పెంచుకుంది. ఇక, ఇటీవలే నాని 'దసరా' మూవీతో మరో భారీ హిట్‌ను సొంతం చేసుకుంది.

ఆ సినిమాల్లో నటిస్తూ:సౌతిండియా మొత్తంలో హవాను చూపిస్తూ వరుసగా సినిమాలు చేస్తోన్న మహానటి కీర్తి సురేష్.. ప్రస్తుతం 'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. వీటితో పాటు 'మామన్నన్', 'సిరేన్', 'రఘు తాతా', 'రివాల్వర్ రీటా' అనే తమిళ సినిమాలను చేసింది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైతం కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఫుల్ బిజీగా గడుపుతోంది.
కీర్తి సురేష్ పెళ్లి వార్త:ఏమాత్రం బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న కీర్తి సురేష్ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి గురించి తరచూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో ఆమె ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయిందని ఓ న్యూస్.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడిని వివాహం చేసుకోబోతుందని ఇంకో వార్త వైరల్ అయింది.

పెళ్లిపై సూటి ప్రశ్న:కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఫ్యాన్స్‌తో ఆమె ముచ్చటిస్తూ తన విషయాలను పంచుకుంటూ ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కీర్తి సురేష్ Ask Me సెషన్‌ను నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ 'నువ్వు పెళ్లి చేసుకుంటున్నావట నిజమేనా' అని ప్రశ్నించాడు.
పెళ్లిపై కీర్తి క్లారిటీగా:నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కీర్తి సురేష్.. నటుడు వడివేలు ఫొటోతో ఉన్న ఓ మీమ్‌ను షేర్ చేసింది. అందులో అతడు రెండు జేబులూ ఖాళీగా ఉన్నాయని చూపిస్తుంటాడు. తద్వారా తన పెళ్లి అని వస్తున్న వార్తలు అబద్ధం అని ఆమె పరోక్షంగా వెల్లడించింది. అదే సమయంలో తన ఎఫైర్ల గురించి వస్తున్న పుకార్లకు కూడా ఈ హీరోయిన్ పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.


Click it and Unblock the Notifications











