ఆఫర్ కోసం వెళ్తే.. హీరోలు డేటింగ్ కు పిలిచి.. యంగ్ హీరోయిన్ షాకింగ్ అనుభవం
మలయాళ ముద్దుగుమ్మ, కన్నడ బ్యూటీ రెబా మోనికా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు సరసన 'సామజవరగమన' చిత్రంలో నటించి మెప్పించింది. అప్పటికే 'బూ' అనే తమిళ్, తెలుగు బైలింగ్వుల్ ప్రాజెక్ట్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సామజవరగమనతో ఇక్కడి ఆడియెన్స్ కు దగ్గరైంది. టాలీవుడ్ లో తొలి ప్రాజెక్ట్ తోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన అందం అభినయంతో కట్టిపడేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులోనూ ఆఫర్లు దక్కుతుండటం విశేషంగా మారింది.
ఇదిలా ఉంటే.. చలన చిత్ర పరిశ్రమలో మనుగడ సాధించాలంటే నటీనటులు ఎన్నో అడ్డంకులు దాటుకొని, సమస్యలను ఎదుర్కోని లక్ష్యాలను చేధించాల్సి ఉంటుంది. హీరోలకు ఉండే సమస్యలు ఒకరకమైతే.. హీరోయిన్లకు మాత్రం అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతుంటాయి. కాస్తా హిట్ సినిమా పడే వరకు వారి కష్టాలు అన్నీఇన్నీ కావనేది ఆయా ఇంటర్వ్యూల్లో పలువురు నటీమణులు చెప్తుండటం చూస్తునే ఉన్నాం. కాగా మలయాళం, తమిళ చిత్రాలతో బిజీగా ఉండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికాకు అదే పరిస్థితి ఎదురైందంట.

రీసెంట్ గా రెబా మోనికా జాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తను ఆఫర్ల కోసం వెతుకుతుంటే... కొందరు డేటింగ్ కు వస్తావా? అంటూ ఎలాంటి భయం లేకుండా అడిగేస్తుంటారని చెప్పింది. అలా జరుగుతూనే ఉందని సున్నితంగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. చాలా మంది అడుగుతూనే ఉంటారని ఓపెన్ గా మాట్లాడింది. అయితే.. రెబా మోనికా తెలుగు లో ఇప్పటి వరకు చేసింది ఒక్క సినిమానే కావడంతో.. ఆమె డేటింగ్ ఆఫర్ల సమస్య ఎక్కడ మొదలైందనేది ఆసక్తికరంగా మారింది.
ఇంటర్వ్యూయర్ అదే ప్రశ్నను అడిగాడు. మొత్తం సౌత్ ఇండస్ట్రీలో మీకు అలాంటి పరిస్థితి ఎదురైందా? లేకా టాలీవుడ్ లోనే ఎదురైందా? అని ప్రశ్నిస్తాడు. కానీ రెబా మోనికా మాత్రం ప్రత్యేకించి చెప్పలేదు. ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతూనే ఉంటాయని దాటవేసింది. తనను కూడా చాలా మంది డేట్ కు వస్తావా? అని అడిగారని.. కానీ ఆమె వెళ్లిందా? లేదా? అన్నదే అక్కడ ప్రధానం అవుతుందని చెప్పింది. తను అలాంటి విన్నపాలను నిరాకరిస్తూనే వచ్చినట్టు తెలిపింది. ఎవరు ఏమీ అడిగినా పాజిటివ్ గానే తీసుకుంటానని, నెగెటివ్ ఆలోచనలను దరిచేరనివ్వనని చెప్పింది. తను ప్రస్తుతం సినిమాలతోనే బిజీగా ఉన్నట్టు తెలిపింది... ఇలా రెబా మోనికా మాటలు నెటిజన్లకు ఆసక్తికరంగా మరాయి.

ఇక రెబా మోనికా 'బిజిల్', 'రత్నన్ ప్రపంచ', 'ఎఫ్ఐఆర్', 'సమజవరగమణ వంటి చిత్రాలతో దక్షిణాది ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తమిళం, హిందీ, తెలుగు, కన్నడ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉండటం విశేషం. అందులో ప్రధానమైన ప్రాజెక్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ'. ఈ చిత్రంలో రెబా మోనికా కీలక పాత్ర పోషించబోతోంది. అలాగే హిందీలో 'లయన్', తెలుగులో 'మ్యాడ్ స్క్వేర్', కన్నడలో 'శకలక వల్లభ' వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











