షారుఖ్ పక్కింటిని కొనేసిన దీపిక- రణవీర్.. అన్ని కోట్లా , బాలీవుడ్‌లో లగ్జరీ ఇళ్లు ఉన్నది వీరికే

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం దీపిక గర్భవతి అన్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. నెలలు నిండటంతో ప్రస్తుతం షూటింగ్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్‌కు దూరంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు దీపిక. ఇకపోతే.. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వాణిజ్య ప్రకటనలు, వ్యాపారాల ద్వారా దీపిక రూ.కోట్లకు పడగలెత్తారు. ఆమె ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పై మాటే. ఏడాదికి రూ. 50 కోట్ల పైనే దీపిక సంపాదిస్తున్నారని టాక్.

ఆమె భర్త రణవీర్ సింగ్ కూడా బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరో. సినిమాల రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా ఇతను కూడా బాగానే ఆర్జిస్తున్నాడు. రణవీర్ సింగ్ మొత్తం ఆస్తుల విలువ రూ.245 కోట్ల పైనే అని అంచనా. భార్యాభర్తలిద్దరి సంపద విలువ రూ.800 కోట్ల వరకు ఉందని బాలీవుడ్ టాక్. ఇదిలాఉండగా.. ముంబైలోని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్‌కు పక్కనే దీపిక- రణవీర్‌ దంపతులు ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లుగా సమాచారం. దీని విలువ అక్షరాలా రూ.100 కోట్ల పై మాటేనని బీటౌన్ టాక్. దాదాపు 11,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాకు టెర్రస్ కూడా ఉందట.

Deepika Padukone and Ranveer Singh To Become Shah Rukh Khan s Neighbor In 100 Crore house here s the details

రణవీర్, దీపికలు లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన నేపథ్యంలో బాలీవుడ్‌లో ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్న స్టార్స్ ఎవరా అంటూ నెటిజన్లు ఆన్‌లైన్‌ను జల్లెడ పడుతున్నారు. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి.. జుహూ ఏరియాలో హృతిక్ రోషన్‌కు చెందిన సీ ఫేస్ అపార్ట్‌మెంట్‌ను శ్రద్ధా కపూర్ అద్దెకు తీసుకున్నారు. దీనికి పక్కనే అక్షయ్ కుమార్ ఇల్లు ఉంది.

సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్.. తన తండ్రితో కలిసి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ కుటుంబానికి చెందిన రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఇది ముంబైలో అంధేరీ వెస్ట్ ఏరియాలో ఉంది. బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్ పూణేలో 4248 చదరపు అడుగుల విశాలమైన ప్రాపర్టీని రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసి.. దానిని నెలకు రూ.3.5 లక్షల మేర అద్దెకు ఇచ్చాడు. జాన్ అబ్రహం ముంబై ఖార్‌లోని లింకింగ్ రోడ్ ఏరియాలో రెండంతస్తుల బంగ్లాను కొనుగోలు చేశారు. దీని విలువ రూ.70.83 కోట్లని అంచనా, ఇందుకోసం ఈ స్టార్ హీరో రూ.4.24 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించాడు.

Deepika Padukone and Ranveer Singh To Become Shah Rukh Khan s Neighbor In 100 Crore house here s the details

అలియా భట్ తన ప్రొడక్షన్ హౌస్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ద్వారా ముంబై బాంద్రా ప్రాంతంలో రూ.38 కోట్లకు అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. తన భర్త రణబీర్ కపూర్, కుమార్తె రాహాతో కలిసి త్వరలోనే ఇందులో గృహ ప్రవేశం చేయనుంది. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ అలీబాగ్‌లోని థాల్ గ్రామంలో ఓ ఫార్మ్‌హౌస్‌ని కొనుగోలు చేసింది. దీని విలువ రూ.9.5 కోట్లు. ఈ లిస్ట్‌లో ఇంకా చాలా మంది సెలబ్రెటీలు ఉన్నారు. ఒకరిని చూసి మరొకరు తమ స్టేటస్‌కు అనుగుణంగా విలాసవంతమైన ఇంట్లో నివసించాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఇందుకోసం వారు ఖర్చు చేసే డబ్బును చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X