BAFTA Awards దీపిక పదుకోన్‌కు మరో అరుదైన గౌరవం.. ఆస్కార్ తర్వాత బాఫ్టా అవార్డుల్లో!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్‌కు అరుదైన ఘనత సొంతం చేసుకొన్నది. 2024 సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బాఫ్టా (BAFTA Film Awards) అవార్డుల్లో పాల్గొనే అవకాశం ఈ అందాల భామకు దక్కింది. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ఇన్స్‌గ్రామ్‌కు దీపిక ధన్యవాదాలు తెలియజేసింది. అయితే ఈ అవార్డుల కార్యక్రమంలో పలువురు లెజెండరీ క్రీడాకారులు, సినీ ప్రముఖులతో కలిసి సందడి చేయనున్నది. దీపిక లభించిన ఘనమైన ఆఫర్ గురించిన వివరాల్లోకి వెళితే..
బాఫ్టా ఫిలిం (BAFTA Film Awards) అవార్డుల కమిటీ ఆదివారం జరుగనున్న వేడుకల్లో ప్రజెంటర్స్‌గా వ్యవహరించేందుకు పలువురు సినీ ప్రముఖులను ఎంపిక చేసింది. వారిలో ఫుట్ బాల్ మాంత్రికుడు డేవిడ్ బెక్‌హామ్, ఆస్ట్రేలియా నటి, నిర్మాత కేట్ బ్లాంకెట్, ఇంగ్లీష్, అల్బేనియన్ సింగర్ డుయా లిపా ఉన్నారు. వీరితోపాటు దీపి పడుకోనే కూడా అవార్డులను ప్రజెంట్ చేస్తారు అని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

గతేడాది ఆస్కార్ అవార్డుల వేడుకలో కూడా దీపిక పదుకోన్ సందడి చేశారు. అవార్డుల కార్యక్రమంలో ప్రజెంటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఫెస్టివల్ హాల్‌లో ఫిబ్రవరి 18న జరిగే వేడుకలో సినీ ప్రముఖులు, క్రీడా దిగ్గజాలతో కలిసి పాల్గొంటారు.
దీపిక పదుకోన్‌తోపాటు బాఫ్టా (BAFTA Film Awards) అవార్డుల్లో ప్రజెంటర్స్‌గా ఎంపికైన వారిలో అడోజా అండో, హ్యు గ్రాంట్, లిలీ కోలిన్, ఎమ్మా కొరిన్, జిలియన్ అండర్సన్, హిమేష్ పటేల్, ఐడ్రీస్ ఎల్బా తదితరులు పాల్గొంటారని బాఫ్టా అవార్డుల కమిటీ అధికారికంగా వెల్లడించింది.

ఇక దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. గత రెండేళ్లుగా వరుస సినిమాల్లో నటిస్తున్నది. గతేడాది షారుక్ ఖాన్‌తో కలిసి పఠాన్ చిత్రంలో నటించింది. తాజాగా హృతిక్ రోషన్‌తో కలిసి ఫైటర్ చిత్రంలో నటించి భారీ హిట్‌ను సొంతం చేసుకొన్నది. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ప్రాజెక్ట్K చిత్రంలో నటిస్తున్నది. త్వరలోనే ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











