మూడు రోజుల్లోనే పది యాడ్స్.. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటే సక్సెస్ అయినట్టు కాదు. పది కాలాల పాటు ఆ క్రేజ్ ని అలానే నిలబెట్టుకోవడం అసలైన సక్సెస్ అని నిరూపిస్తోంది ఒక బాలీవుడ్ బ్యూటీ. ఆమె మరెవరో కాదు రణ్ వీర్ సింగ్ సతీమణి దీపికా పదుకోన్. దీపికా ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమామ్ బాక్సాఫీస్ హిట్టయ్యేలా చూసుకోవడం ఆమె అలవాటు.
ఇక లాక్ డౌన్ కరోనా వైరస్ కారణంగా ఆదాయం తగ్గతున్న సమయంలో అమ్మడు మూడు రోజుల్లోనే వందల కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఒక విధంగా భర్త రణ్ వీర్ కంటే కూడా అమ్మడు ఒక ఏడాదిలో అత్యదిక ఆదాయాన్ని పెంచుకుంటోంది. ఇటీవల వరుసగా మూడు రోజుల్లో దీపికా పది కంపెనీలకు సంబంధించిన యాడ్స్ లలో నటించింది.

అందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా సినిమాలకంటే కూడా యాడ్స్ ద్వారానే దీపికా తన ఆదాయాన్ని ఎక్కువగా పెంచుకుంటోంది. ఇక నెక్స్ట్ మరో ఐదేళ్ల వరకు కూడా ఈ బ్యూటీ స్థానానికి ఏ మాత్రం డోకా ఉండదని చెప్పవచ్చు. చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి.
కపిల్ దేవ్ బయోపిక్ రిలీజ్ కి సిద్ధంగా ఉండగా.. ఒక పాన్ ఇండియా సినిమాకి కూడా ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభాస్ నాగ్ అశ్విమ్ కాంబినేషన్ లో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో దీపికా హీరోయిన్ గా నటించనున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు పెద్ద సినిమాలకు కూడా ఈ హీరోయిన్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











