For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Deepika Padukone at Cannes: చీరకట్టుతో మెరిసిన దీపిక.. రెడ్ కార్పెట్‌పై నూడుల్ స్ట్రాప్ జాకెట్‌తో గ్లామర్ ట్ర

    |

    కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 ప్రారంభమైంది. దీనికి హాజరయ్యేందుకు పలువురు బాలీవుడ్ ప్రముఖ నటీ, నటులు చేరుకున్నారు. ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 ప్రత్యేకం ఎందుకంటే ఈసారి భారత్ కు 'కంట్రీ ఆఫ్ హానర్' అవార్డు దక్కబోతోంది. నటి దీపికా పదుకొణె ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 జ్యూరీలో కూడా భాగమైంది. మే 17 సాయంత్రం జ్యూరీ విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో సబ్యసాచి డిజైన్ చేసిన ప్యాంట్ షర్ట్ దుస్తులను దీపికా పదుకొణె ధరించింది. ఇక రెడ్ కార్పెట్ లుక్ లో కూడా అందమైన చీరలో మెరిసింది. ఆ వివరాల్లోకి వెళితే

    దేశీ జూలియా ఫాక్స్

    దేశీ జూలియా ఫాక్స్

    నటి దీపికా పదుకొణె 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె లుక్‌, డ్రెస్‌పై చర్చ జరుగుతోంది. అదే సమయంలో, దీపిక మేకప్ విషయంలో ట్రోలర్స్ కు టార్గెట్‌గా మారింది. కేన్స్‌లో దీపికా చీరల ఎంపికపై నెటిజన్లు బాగా ఇంప్రెస్ అయ్యారు. అయితే ఆమె మేకప్ గురించి చాలా కోపంగా ఉన్నారు. దీంతో ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు దీపికను 'దేశీ జూలియా ఫాక్స్' అని కూడా కామెంట్ చేస్తున్నారు. జూలియా ఫాక్స్ ఒక ఇటాలియన్-అమెరికన్ మోడల్.

    ఎప్పటికీ ఆపను

    ఎప్పటికీ ఆపను

    మంగళవారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన బెంగాల్ టైగర్ చీరను ధరించి దీపిక అందరి కళ్ళు తన వైపుకు తిప్పుకున్నాను. దీపికా జ్యూరీ మెంబర్‌గా కేన్స్‌కు హాజరయ్యారు. ఇక దీపికా రెడ్ కార్పెట్ ఫోటోలను నటి దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆమె క్యాప్షన్‌లో, 'చీరలో ఒక కథ ఉంది, నేను చెప్పడం ఎప్పటికీ ఆపను' అని రాసుకొచ్చారు.

    ఏకీభవిస్తున్నాను

    ఏకీభవిస్తున్నాను

    ప్రపంచంలో ఏ ప్రదేశంలో ఉన్నా పట్టింపు లేదని సబ్యసాచి ముఖర్జీ చెప్పారు. చీరకు తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. నేను వారు చెప్పిన పాయింట్‌తో ఏకీభవిస్తున్నాను అని దీపికా పేర్కొంది. ఇక దీపికా పదుకొణె చీర లుక్ వైరల్గా మారింది. నటి దీపికా పదుకొణె ఈసారి తన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 రూపాన్ని పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఉంచడానికి నిర్ణయించుకుంది.

    అందరి దృష్టిని

    అందరి దృష్టిని

    మే 17 నుంచి మే 28 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో దీపికా పదుకొణె సంప్రదాయ దుస్తులతో కనిపించబోతోంది. మొదటి రెడ్ కార్పెట్ లుక్, దీపికా పదుకొణె నలుపు - బంగారు రంగులో మెరిసే చీరను ధరించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. స్టైలిస్ట్ షాలీనా నంతని దీపికా పదుకొణెకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అందులో ఆమె దుస్తులకు సంబంధించిన వివరాల గురించి కూడా ఆమె షేర్ చేసుకున్నారు.

    నూడుల్ స్ట్రాప్ జాకెట్‌తో

    నూడుల్ స్ట్రాప్ జాకెట్‌తో

    కేన్స్ రెడ్ కార్పెట్ మీద చీరకట్టుతో మెరిసిన దీపిక, రెడ్ కార్పెట్‌పై నూడుల్ స్ట్రాప్ జాకెట్‌తో గ్లామర్ ట్రీట్ ఇచ్చేసింది. ఆమె దెబ్బకు అభిమానులు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఆమె ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

    English summary
    Deepika Padukone became centre of attraction at Cannes Red Carpet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X