రణ్‌వీర్ సింగ్‌ను కాదు.. అతడితో పెళ్లి అంటూ .. సల్మాన్ చిలిపి ప్రశ్నకు దీపిక పదుకోన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ వరుస సక్సెస్‌లతో దూపుకెళ్తున్నది. పఠాన్ చిత్రంలో దీపిక పెర్ఫార్మెన్స్, గ్లామర్ ప్రదర్శనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వ్యక్తిగత విషయానికి వస్తే.. రణ్‌వీర్ సింగ్‌ను దీపిక పదుకోన్ పెళ్లి చేసుకొని లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నది. అయితే దీపికను సల్మాన్ ఖాన్ అడిగిన ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పెళ్లి గురించి సల్మాన్ ఖాన్ అడిగిన చిలిపి ప్రశ్నకు దీపిక పదుకోన్ ఇచ్చిన సమాధానం ఏమిటంటే?

సల్మాన్ ఖాన్‌తో చిలిపిగా
గతంలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ వేదికపై దీపిక పదుకోన్ వెళ్లింది. బిగ్ బాస్ స్టేజ్‌పై తన సినిమా ప్రమోషన్స్‌ను క్రేజీగా చేసింది. బిగ్‌బాస్ ఇంటి సభ్యులతో నేరుగా ముచ్చటించింది. ఓ వైపు సల్మాన్ ఖాన్‌తో చిలిపిగా ముచ్చటిస్తూనే ఇంటిలోని విషయాలను అడిగి తెలుసుకొన్నది.

సంజయ్ లీలా భన్సాలీని పెళ్లి చేసుకొంటా
బిగ్‌బాస్ వేదికపై జోష్‌తో కనిపించిన దీపిక పదుకోన్‌ను ఇరుకున పెట్టేందుకు సల్మాన్ ఖాన్ ప్రయత్నిస్తూ.. సంజయ్ లీలా భన్సాలీ, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ఎవరిని పెళ్లి చేసుకొంటావు? ఎవరితో డేటింగ్ చేస్తావు? ఎవరిని చంపేస్తావు? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేను సంజయ్ లీలా భన్సాలీని పెళ్లి చేసుకొంటాను అని దీపిక చెబితే.. ఆ విషయం కుదరదు అని సల్మాన్ అన్నాడు. దాంతో ఎందుకు కుదరదు అంటే.. సరే.. కుదురుతుంది లే అంటూ సల్మాన్ ఒప్పేసుకొన్నాడు.

రణ్‌వీర్ సింగ్‌తో డేట్ చేస్తా
ఇక తన ప్రియుడు రణ్‌వీర్ సింగ్ గురించి చెబుతూ.. తనతో డేట్ చేస్తాను అని సమాధానం చెప్పింది. అయితే అప్పటికీ ఇంకా రణ్‌వీర్ సింగ్‌తో పెళ్లి కాకపోవడంతో అతడితో డేట్ చేస్తానంటూ సరిపెట్టుకొన్నది. ఆ తర్వాత షాహిద్ కపూర్‌కు పెళ్లి జరిగిపోయింది కాబట్టి.. అతడిని చంపేస్తాను అని దీపిక తెలివిగా సమాధానం చెప్పింది.

సంజయ్‌తో గాఢమైన అనుబంధం
ఇక సంజయ్ లీలా భన్సాలీతో దీపిక పదుకోన్‌కు ఉన్న అనుబంధం విషయానికి వస్తే.. ఆయనతో మూడు సినిమాలు తీసింది. రామ్ లీలా చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించింది. ఆ తర్వాత భాజీరావు మస్తానీ, పద్మావత్‌లో నటించింది. పద్మావత్ చిత్రంలో దీపిక నటనకు సినీ విమర్శకులు ప్రశంసలతోపాటు సగటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే..
దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల సర్కస్, పఠాన్ సినిమాలో ప్రేక్షకుల మంుదుకు వచ్చింది. ఇంకా షారుక్ ఖాన్‌తో జవాన్, ఫైటర్, ప్రభాస్‌తో ప్రాజెక్ట్K చిత్రాల్లో నటిస్తున్నది. ఇంకా పలు ప్రాజెక్టుల్లో అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించేందుకు సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











