Deepika padukone : తండ్రైన రణవీర్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా, ఎవరు పుట్టారంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె , రణవీర్ సింగ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దీపిక పదుకొనె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా దీపిక - రణవీర్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో దీపిక, రణవీర్ కుటుంబాలు సంబబరాల్లో మునిగిపోయాయి.
దీపికా పదుకొనె తన సహ నటుడు రణవీర్ సింగ్‌ను 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయినా సినిమాలను పక్కనపెట్టకుండా బడా ప్రాజెక్ట్స్‌లో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు దీపిక. వివాహం తర్వాత పలుమార్లు దీపిక ప్రెగ్నెంట్ అని, ఇదిగో బేబీ బంప్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 18న లండన్‌లో జరిగిన బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు దీపిక.

ఆ సమయంలో తన చీర కొంగుతో బేబీ బంప్‌ను దాచుకోవడానికి ప్రయత్నించినట్లుగా ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఫిబ్రవరి 29న రణవీర్ - దీపికలు చిన్నారి దుస్తులు, చెప్పులు, బొమ్మలతో డిజైన్ చేసిన ఓ పోస్టర్‌ను పోస్ట్ చేసి తాము త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్నట్లుగా చెప్పారు. గర్భం దాల్చినప్పటికీ సినిమాలు చేసి వృత్తిపై తన అంకిత భావాన్ని చాటుకున్నారు దీపిక. నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీలో నటించారు. ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కల్కి ప్రమోషనల్ ఈవెంట్లకు కూడా హాజరై శెభాష్ అనిపించుకున్నారు.
కొద్దిరోజుల క్రితం దీపికా పదుకొనె మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే నిమిషాల వ్యవధిలోనే ఇది ఫేక్ న్యూస్ అని తేలింది. ఇటీవల దీపిక తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ డేట్స్‌లో కనిపించారు. రణవీర్ తండ్రి జగ్జిత్ సింగ్ భవ్నానీ, తల్లి అంజు భవ్నానీ, సోదరి రితికా భవ్నానీలు ఈ విందుకు హాజరయ్యారు. దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనె వద్ద బ్యాడ్మింటన్‌లో కోచింగ్ తీసుకున్న లక్ష్యసేన్ కూడా ఈ డిన్నిర్‌కు అటెండ్ అయ్యారు.

రీసెంట్‌గానే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్‌ను ఆనుకుని ఉన్న భవనాన్ని రణవీర్ - దీపికలు రూ.100 కోట్లు పైగా వెచ్చించి కొనుగోలు చేసి ఇండస్ట్రీకి షాకిచ్చారు. వినాయక చవితికి ముందు రోజు ముంబైలోని సిద్ధి వినాయక స్వామి ఆలయంలో దీపిక, రణవీర్ రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డెలివరీ డేట్ దగ్గర పడటంతో శనివారం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో దీపిక అడ్మిట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, సన్నిహితులు దీపిక- రణవీర్ దంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈ స్టార్ కపుల్స్ తమ బిడ్డతో కలిసి కొత్తింటిలో పాలు పొంగిస్తారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.


Click it and Unblock the Notifications











